హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ ఫాంటసీ డ్రామా ఆగస్టు 1న రిలీజ్ అవుతుంది. ఇందులో మంచు మనోజ్ విలన్ గా చేయడం అంచనాలు ఆల్రెడీ పెంచేసింది. దీనికి సంబంధించిన టీజర్ గతంలో వచ్చి ఫ్యాన్స్ మెప్పు పొందింది. తాజాగా దగ్గుబాటి రానా ఈ క్రేజీ క్యాస్టింగ్ లో భాగమైనట్టుగా లేటెస్ట్ అప్డేట్. పాత్ర తీరుతెన్నులు ఇంకా తెలియలేదు.
వాస్తవానికి ఈ క్యారెక్టర్ కు ముందు దుల్కర్ సల్మాన్ ని అనుకున్నారు. కానీ డేట్లు తదితర సమస్యల వల్ల ఆ స్థానంలో రానా వచ్చినట్టు తెలిసింది. రానా నిర్మాణంలోనే దుల్కర్ ‘కాంత’లో హీరోగా చేయడం ఈ లింక్ ముడిపడేందుకు దోహదం చేసినట్టు అంతర్గత సమాచారం. సో మిరాయ్ లో తేజ, మనోజ్ తో పాటు రానా జత కట్టడం హైప్ పరంగా చాలా ప్లస్ కానుంది మానవాళికి సవాల్ గా మారిన ఒక అంతుచిక్కని రహస్యం కోసం సాహస యాత్రలు చేసే యువకుడిగా తేజ ఇందులో డైనమిక్ గా కనిపించనున్నట్టు వినికిడి. మార్కెట్ ఎంతనేది కాకుండా కంటెంట్ ని నమ్మి పీపుల్స్ మీడియా వంద కోట్లకు పైగా పెడుతోంది.
రాజా సాబ్, మిరాయ్ లాంటి రెండు ప్యాన్ ఇండియా మూవీస్ ని ఒకేసారి సెట్స్ మీద పెట్టిన పీపుల్స్ మీడియా వీటి మీద అయిదు వందల కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తోంది. విడుదల పరంగా రెండింటి మధ్య గ్యాప్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్యాన్ ఇండియా భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన లాంగ్వేజెస్ లో మిరాయ్ విడుదల కానుంది.రవితేజ ఈగల్ తర్వాత కార్తిక్ ఘట్టమనేని ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో మిరాయ్ మీద పని చేస్తున్నాడు. విజువల్స్ అబ్బురపరిచేలా ఉంటాయని విఎఫ్ఎక్స్ గురించి వినిపిస్తున్న టాక్. ఇదే నిజమైతే తేజ సజ్జ ఇమేజ్ మరింత ఎగబాకినట్టే.
This post was last modified on April 2, 2025 7:56 am
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…