నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి తెరమీద అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో చూసుకోవడానికి ఒక పావు గంట ఫుటేజ్ ని స్క్రీనింగ్ చేసుకున్నారు తప్పించి మొత్తం సినిమా కాదు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. అందరి ఆర్టిస్టుల డబ్బింగ్ అవ్వలేదు. ఫైనల్ కాపీ ఇప్పుడప్పుడే రెడీ కాదు. అలాంటప్పుడు ప్రీమియర్ ఛాన్స్ లేదు. కేవలం పదిహేను నిముషాలు మాత్రమే జరిగిన షోకు మోహన్ బాబు, మంచు విష్ణుతో పాటు ఇతరత్రా కీలక సభ్యులు పాల్గొన్నారు తప్పించి ఇంకేమి లేదు.
ఇది జరిగిన తర్వాత విష్ణు బృందం షో గురించి రివ్యూ చేసుకున్నట్టు సమాచారం. ఎలాంటి కరెక్షన్లు అవసరమవుతాయనే దానితో పాటు నిజాయితీగా అనిపించిన నెగటివ్ విషయాలను కూడా ఓపెన్ గా డిస్కస్ చేసుకున్నారట. ఎట్టి పరిస్థితుల్లో రాజీ ప్రస్తావనే లేకుండా బెస్ట్ ఇవ్వాలనే సంకల్పంతో కొత్త డేట్ అనౌన్స్ చేసే విషయంలో తొందరపడకుండా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పని చేస్తున్న విఎఫెక్స్ కంపెనీలు ఇస్తున్న క్వాలిటీ మీద రెగ్యులర్ గా పోస్ట్ మార్టం జరుగుతోంది. మొన్న విష్ణు ట్వీట్ లో ప్రస్తావించిన ప్రత్యేక ఎపిసోడ్ ప్రభాస్ గురించేనని ఇన్ సైడ్ ఇన్ఫో.
సరే జరిగే ఆలస్యం ఎలాగూ అయ్యింది కానీ ఇకపై పూర్తిగా కాపీ సిద్ధమయ్యాకే తేదీని ప్రకటించడం బెటర్. కన్నప్పకి ఇంకా పూర్తి స్థాయి థియేటర్ బిజినెస్ మొదలుపెట్టలేదు. ట్రైలర్ వచ్చాక డిమాండ్ పెరుగుతుందనే ఉద్దేశంతో విష్ణు తొందరపాటు ప్రదర్శించడం లేదు. పైగా ఓటిటి డీల్స్ వద్దనుకుని మరీ ఆఫ్టర్ రిలీజ్ మాట్లాడుదామని చెప్పేశాడు. దీన్ని బట్టే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అర్థమవుతోంది. మొదట్లో వచ్చిన పోస్టర్ల మీద కాస్త ట్రోలింగ్ నడిచింది కానీ టీజర్, లిరికల్ సాంగ్స్ ఆ డ్యామేజ్ తగ్గించాయి. దాన్ని నిలబెట్టుకుంటూ అంచనాలు పెంచడం కన్నప్ప టీమ్ ముందున్న తక్షణ కర్తవ్యం.
This post was last modified on April 1, 2025 8:59 pm
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…