నాగచైతన్యని పెళ్లి చేసుకుని మూడుముళ్ల బంధంలో అడుగు పెట్టిన శోభిత ధూళిపాళ తిరిగి నటన వైపు దృష్టి సారించబోతోంది. ఆ మధ్య ఓ వెబ్ మూవీ వచ్చింది కంటెంట్ పరంగా ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో రిలీజైన విషయమే చాలా మందికి తెలియకుండా పోయింది. తాజాగా శోభితకు దర్శకుడు పా రంజిత్ తో కలిసి పని చేసే అవకాశం రానుంది. వెట్టువమ్ టైటిల్ తో పా రంజిత్ మూడేళ్ళ క్రితమే ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. అంటే తంగలాన్ కంటే ముందే. కానీ ఏవేవో కారణాల వల్ల అది ఆలస్యమవుతూ వచ్చింది. మధురై బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ డ్రామాగా త్వరలోనే షూట్ మొదలుపెట్టబోతున్నట్టు చెన్నై టాక్.
దీనికి సంబంధించిన మరికొన్ని విశేషాలు ఆసక్తి రేపెలా ఉన్నాయి. వెట్టువమ్ లో వరుడు ఫేమ్ ఆర్య విలన్ గా నటించనుండగా మనకు అంతగా పరిచయం లేకపోయినా పలు డబ్బింగ్ సినిమాల ద్వారా పేరు తెచ్చున్న దినేష్ లీడ్ రోల్ పోషించనున్నాడు. దొంగతనాలు వృత్తిగా మార్చుకున్న హీరో శత్రువులను అంతమొందించేందుకు పోలీస్ గా మారతాడు. కానీ తాను ఊహించిన దానికన్నా దారుణమైన పరిస్థితులు ఖాకీ వ్యవస్థలో ఉన్నట్టు తెలుసుకుని అనూహ్య నిర్ణయం తీసుకుంటాడు. పాయింట్ మరీ కొత్తగా అనిపించనప్పటికీ సబ్జెక్టులోని పా రంజిత్ ట్రీట్మెంట్ వేరే స్థాయిలో ఉంటుందని కోలీవుడ్ టాక్.
ఇప్పుడిది సెట్స్ పైకి వెళ్తోంది కాబట్టి శోభిత ధూళిపాళకు మంచి ఛాన్స్ దొరికినట్టే. అసలే పా రంజిత్ సినిమాల్లో హీరోయిన్లకు చాలా ఛాలెంజులు ఉంటాయి. ఊరికే ఆడిపాడే తరహా కాకుండా క్లిష్టమైన క్యారెక్టరైజేషన్ ఇస్తాడు. తంగలాన్ లో మాళవిక మోహనన్ ని వాడుకున్న తీరే దానికి నిదర్శనం. అయినా మూడేళ్ళ క్రితం అనౌన్స్ చేసి ఆపేసిన సినిమాను ఇప్పుడు కొనసాగించడం విచిత్రమే. ఒకప్పుడు రజనీకాంత్ తో వరుసగా రెండు సినిమాలు చేసే రికార్డు దక్కించుకున్న ఈ విలక్షణ దర్శకుడు తర్వాత ట్రాక్ తప్పేశారు. అయినా సరే తనమీద ప్రత్యేక అంచనాలు పెట్టుకునే అభిమానులు వేరే ఉన్నారు.
This post was last modified on April 1, 2025 2:51 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…