దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కెరీర్ లో బ్యాడ్ మూవీ ఏదంటే ముందుగా మహేష్ బాబు అభిమానులు ఠక్కున చెప్పే పేరు స్పైడర్. ఇకపై ఆ అవసరం లేకుండా సికందర్ వచ్చేసింది. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా రూపొందిన ఈ భారీ యాక్షన్ మూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. రిలీజ్ కు కొన్ని గంటల ముందే హెచ్ది పైరసీ బారిన పడిన ఈ సినిమా మీద వచ్చినన్ని నెగటివ్ రివ్యూలు, పూర్ టాక్స్ గత దశాబ్ద కాలంలో దేనికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆఖరికి సల్మానే వరస్ట్ అని ఒప్పుకునే రేస్ 3 సైతం దీనికన్నా మెరుగైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇంతకీ సికందర్ కథా కమామీషు ఏంటో చూద్దాం.
రాజ్ కోట్ ఊరికి సంజయ్ అలియాస్ సికందర్ (సల్మాన్ ఖాన్) అనధికార దేవుడు. మహారాజుగా కీర్తించబడుతూ ఉంటాడు. భార్య సాయిశ్రీ (రష్మిక మందన్న) ఒక యాక్సిడెంట్ లో చనిపోతే ఆమె అవయవాలు వివాహిత వైదేహీ (కాజల్ అగర్వాల్) తో పాటు మరో ఇద్దరికి అమరుస్తారు. వాళ్ళ బాగోగులు చూసేందుకు ముంబై వెళ్తాడు సికందర్. కొడుకు మరణానికి సంజయే కారణమని రగిలిపోతున్న హోమ్ మినిస్టర్ ప్రధాన్ (సత్యరాజ్) ఇపుడా ముగ్గురితో పాటు హీరోని చంపేందుకు కంకణం కట్టుకుంటాడు. చివరికి ఎవరు గెలుస్తారు, క్లైమాక్స్ ఎలా ఉంటుందనేది చిన్నపిల్లాడు కూడా సులభంగా చెప్పేలా ముగుస్తుంది.
స్టోరీ సంగతి పక్కనపెడితే 80 దశకం నాటి ట్రీట్ మెంట్ తో అసలిలాంటి సబ్జెక్టు ఎలా వర్కౌట్ అవుతుందని నిర్మాత, హీరో భావించారో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. ఒకప్పుడు గజినీ, కత్తి లాంటి అద్భుతమైన సినిమాలిచ్చిన మురుగదాస్ నుంచి ఇలాంటి థర్డ్ గ్రేడ్ ప్రోడక్ట్ ఎవరూ ఆశించరు. స్పైడర్ లో కనీసం రెండు పాటలు బాగుంటాయి. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఒకటి రెండు ఎపిసోడ్స్ ఫ్యాన్స్ ని అయినా మెప్పిస్తాయి. కానీ సికందర్ లో పొరపాటున కూడా ఒక్క పాజిటివ్ అంశం లేకుండా దాస్ జాగ్రత్తపడ్డాడు. అందుకే తనకే కాదు సల్మాన్ ఖాన్ కు కూడా కెరీర్ బెస్ట్ డిజాస్టర్ దక్కింది.
This post was last modified on March 31, 2025 8:29 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…