దక్షిణాదిన లెజెండరీ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. ఆయన ఎలాంటి ఆణిముత్యాలు అందించారో తెలిసిందే. మణిరత్నం సినిమాలెలా ఉంటాయన్నది పక్కన పెడితే.. నటీనటులకు మణిరత్నం ఇచ్చే టచ్ వేరుగా ఉంటుంది. మరే సినిమాలో లేనంత అత్యుత్తమంగా ఆయన సినిమాల్లో కనిపిస్తారు నటీనటులు. ఒక పట్టాన రాజీ పడని మణిరత్నంను మెప్పించడం అంత సులువు కాదని ఆర్టిస్టులు అంటుంటారు. కానీ ‘యువ’ సినిమా చేసేటపుడు మాత్రం మణిరత్నంను సూర్య మెప్పించగలిగినా.. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ను మాత్రం మెప్పించలేకపోయాడట.
మణిరత్నం షాట్ ఓకే అన్నా కూడా.. ఆ ఏడీ సూర్య నటన బాగాలేదని మొహం మీద చెప్పేసి మళ్లీ అతడితో ఆ సీన్ చేయించారట. అంత ధైర్యంగా సూర్య లాంటి పెద్ద హీరోకు ఆ మాట చెప్పి అతడితో మళ్లీ సీన్ చేయించిన డేరింగ్ అసిస్టెంట్ డైరెక్టర్.. తెలుగమ్మాయే అయిన సుధ కొంగర కావడం విశేషం.
మణిరత్నం శిష్యరికం తర్వాత తెలుగులో ‘ఆంధ్రా అందగాడు’ అనే చిన్న సినిమా ఏదో తీసిన సుధ.. కొన్నేళ్ల కిందట ‘ఇరుదు సుట్రు’ (తెలుగులో ‘గురు’)తో తన సత్తా చాటింది. ఇప్పుడామె సూర్య హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. అమేజాన్ ప్రైమ్‌లో వచ్చే నెల 12న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సూర్య మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా సుధతో తన పరిచయం, ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు.
రెండు దశాబ్దాల కిందటే సుధతో పరిచయమైందని, ‘యువ’ సినిమాకు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ అని.. ఒక సన్నివేశాన్ని మణిరత్నం ఓకే చేసినా.. ఆమె మాత్రం తన దగ్గరికొచ్చి బాగా నటించలేదని చెప్పిందని, ఇంకా బాగా చేయగలవని మొహమాటం లేకుండా చెప్పి తనతో మళ్లీ ఆ సన్నివేశం చేయించిందని.. తన తీరు ఎంతో నచ్చి అప్పట్నుంచి తనతో జర్నీ చేస్తున్నానని సూర్య వెల్లడించాడు. ‘ఆకాశం నీ హద్దురా’ కథ చెప్పగానే మరో మాట లేకుండా ఈ సినిమా చేయాలని నిర్ణయించుకుని తనే సొంతంగా నిర్మించినట్లు సూర్య వెల్లడించాడు.
This post was last modified on October 30, 2020 6:16 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…