ఈ మధ్య కొన్ని తెలుగు పాటల్లో డ్యాన్స్ మూమెంట్స్ మీద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసే స్టెప్స్ వివాదాస్పదం అవుతున్నాయి. గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’లో సితార్ సాంగ్‌లో.. ‘పుష్ప-2’లో పీలింగ్స్ సాంగ్‌లో కొన్ని స్టెప్స్ మీద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతి చిత్రం ‘డాకు మహారాజ్’లోనూ దబిడి దిబిడి పాట మీదా వివాదం తప్పలేదు. ఇక లేటెస్ట్‌గా ‘రాబిన్ హుడ్’ సినిమాలోని ‘అదిదా సర్ప్రైజు’ పాటలో కేతిక శర్మతో వేయించిన హుక్ స్టెప్ మీద పెద్ద వివాదమే నడిచింది. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ స్పందించి.. మహిళలతో వల్గర్ స్టెప్స్ వేయిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ పాట స్టెప్స్‌కు సంబంధించి కరెక్షన్లు జరుగుతున్నట్లుగా టీం వర్గాలు హింట్ ఇచ్చాయి. ఇక ఈ రోజు ‘రాబిన్ హుడ్’ థియేటర్లలో ‘అదిదా సర్ప్రైజు’ పాట చూసిన వాళ్లకు సర్ప్రైజ్ ఎదురైంది. వివాదాస్పదం అయిన హుక్ స్టెప్ సినిమాలో కనిపించలేదు. అలా అని ఆ ఫ్రేమ్ మొత్తం తీసేసి వేరే స్టెప్‌తో రీప్లేస్ చేశారా అంటే అదీ లేదు. ఇక్కడ టీం తెలివిగా మేనేజ్ చేసింది.
కేతిక క్లోజప్ కనిపించేలా ఫ్రేమ్‌ను ఎడిట్ చేసింది. దీంతో నడుం దగ్గర దృశ్యం కనిపించలేదు. ఆ రకంగా వివాదాస్పదం అయిన హుక్ స్టెప్ సినిమాలో కనిపించకుండా జాగ్రత్త పడింది టీం. ఐతే ఈ స్టెప్ చూసి ఊగిపోయిన యువ ప్రేక్షకులు మాత్రం స్క్రీన్ మీద అది లేకపోయేసరికి ఒకింత నిరాశపడే ఉంటారు. రాబిన్ హుడ్ టీం నిర్ణయాన్ని అభినందిస్తున్న వాళ్లూ ఉన్నారు. వీరీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇకపై ఇలాంటి స్టెప్స్ కంపోజ్ చేయడానికి డ్యాన్స్ మాస్టర్లు భయపడతారనడంలో సందేహం లేదు.
This post was last modified on March 28, 2025 9:41 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…