Movie News

ప్రభాస్ పెళ్లి గురించి మళ్ళీ పుకార్లు

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి హఠాత్తుగా మళ్ళీ పుకార్లు మొదలైపోయాయి. హైదరాబాద్ కు చెందిన ఒక బడా వ్యాపారవేత్త కుమార్తెతో వివాహం కుదిరిందని, త్వరలోనే మూడు ముళ్ళు వేయబోతున్నాడని నిన్న కొన్ని మీడియా కథనాల్లో రావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఎలాంటి నిజం లేదు. గతంలోనూ ఇలాగే ఓ భీమవరం ఇండస్ట్రియలిస్ట్ తనయతో సంబంధం కుదిరిందని జోరుగా ప్రచారం చేశారు. కట్ చేస్తే అలాంటిదేమి లేదని తేలింది. ఇప్పుడొచ్చిన గాసిప్ కూడా అదే కోవలోది తప్ప ఎలాంటి నిజం లేదని ప్రభాస్ వర్గం వెర్షన్.

ప్రస్తుతం ప్రభాస్ వయసు 45. తన సమకాలీకులు అందరూ ఓ ఇంటివారైపోయారు. కొందరి పిల్లలు టీనేజ్ కూడా వచ్చేశారు. కానీ డార్లింగ్ మాత్రం నో మ్యారేజ్ అంటూ సినిమాలే ప్రపంచంగా ఉంటున్నాడు. పెదనాన్న కృషంరాజు గారు ఉన్నప్పుడే ఈ ముచ్చట తీర్చుకోవాలని చాలా ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. ఆయన కన్నుమూశాక శ్యామలదేవి గారు సైతం అదే పనిలో ఉన్నారు కానీ ఎంతకీ తెమలడం లేదు. ఇతర స్టార్లు ఒక్కో సినిమాకు ఏడాదికి పైగా టైం తీసుకుంటూ ఉంటే ప్రభాస్ మాత్రం ఒకే టైంలో రెండు మూడు సెట్స్ మీద ఉంచి నిమిషం ఖాళీ లేకుండా చూసుకుంటున్నాడు.

సో ఏతావాతా ఫైనల్ గా తేలేది ఏమిటంటే ప్రభాస్ తానుగా శుభవార్త చెబితే తప్ప ఈ గాసిప్స్ కి శుభం కార్డు పడదు. గతంలో అనుష్కతోనే లగ్గమవుతుందని వార్తలు తిరిగి ఫ్యాన్స్ అది నిజమేమో అని నమ్మేదాకా వచ్చారు. ఆశ్చర్యకరంగా నాలుగు పదుల వయసు దాటినా స్వీటీ కూడా ఇంకా బ్రహ్మచారిగానే ఉంది. ఘాటీ ప్రమోషన్లు మొదలైనప్పుడు దీనికి సంబంధించిన టాపిక్ ఏమైనా వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఆ తర్వాత స్పిరిట్ సెట్స్ లో అడుగు పెడతాడు. అటుపై కల్కి 2, సలార్ 2 శౌర్యంగ పర్వం ఉంటాయి. ఒకవేళ రాజాసాబ్ కనక బ్లాక్ బస్టరైతే దానికీ కొనసాగింపు ఉంటుంది.

This post was last modified on March 28, 2025 10:16 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబు అడుగుజాడల్లో… ప్రజా సేవలోకి భువనేశ్వరి

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణిగానే నిన్నటిదాకా కొనసాగిన నారా భువనేశ్వరి ఇప్పుడు సరికొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారని…

3 hours ago

చింత‌మ‌నేని చెయ్యి పెద్ద‌దే.. రంజాన్ రోజు ఏం చేశారంటే!

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, దెందులూరు ఎమ్మెల్యే , ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా పేరున్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. త‌న చెయ్యి పెద్ద‌ద‌ని…

4 hours ago

మందే ముంచేసింది.. పాస్ట‌ర్ మృతిపై క్లారిటీ!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచ‌ల‌నం రేకెత్తించి.. అనేక అనుమానాల‌ను కూడా సృష్టించిన పాస్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ ప‌గ‌డాల మృతి వ్య‌వ‌హారంలో…

5 hours ago

కాకాణికి ఖాకీల నోటీసులు!… రేపు ఎంక్వైరీకి వస్తారా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం ఏపీ పోలీసులు వేట సాగిస్తున్నారు. కాకాణి సొంత…

6 hours ago

బాబు మౌనం.. ముస్లింల నిర‌స‌న‌.. రీజ‌నేంటి?

ఏపీలో కీల‌క‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు.. గ‌త వారం రోజులుగా నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు చేస్తున్నారు . అయితే.. ప్ర‌భుత్వం…

7 hours ago

మొన్న రణవీర్, నిన్న కునాల్.. నేడు స్వాతి

స్టాండప్ కామెడీ నవ్వు తెప్పించడం సంగతేమో గానీ... కట్టుబాట్లను మాత్రం చాలా సునాయసంగా దాటేస్తోంది. భారత సమాజం గుట్టుగా ఉంచే కార్యకలాపాలను…

8 hours ago