స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పోలినవారి ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. కానీ తాజాగా వైరల్ అయిన ఫోటో మాత్రం క్రికెట్‌కు సంబంధం లేకుండా నేరుగా టీవీ స్క్రీన్ నుంచి వచ్చింది. టర్కీకి చెందిన ప్రముఖ నటుడు కావిట్ సెటిన్ గునెర్ (Cavit Cetin Guner) ఒక టీవీ సీరీస్‌లో కనిపించిన సన్నివేశాన్ని చూసిన నెటిజన్లు అతన్ని కోహ్లీగా భావించి ఆశ్చర్యపోయారు. ‘విరాట్ టీవీ సీరీస్‌లో ఎలా?’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.
ఈ హంగామా రెడ్డిట్ (Reddit) వేదికగా మొదలైంది. ఒక యూజర్, “అనుష్క శర్మ భర్త టీవీ షో అరంగేట్రం చేశాడు” అనే క్యాప్షన్‌తో కావిట్ సెటిన్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో కోహ్లీని తలపించే కళ్లు, గడ్డం, మొఖ ఆకృతి, హెయిర్‌స్టైల్ చూసిన నెటిజన్లు ఏకంగా ఇది కోహ్లీ అని ఫిక్స్ అయ్యారు. “ఇతను కోహ్లీ కాదని నమ్మించాలంటే ఎంతో కష్టమే” అంటూ కామెంట్లు పెట్టారు. మరికొందరు “ఇది అసలు కోహ్లీ కాదు, టర్కీ కోహ్లీ” అంటూ హ్యూమర్ జోడించారు.
వాస్తవానికి ఆ ఫోటో ‘Dirilis: Ertugrul’ అనే తుర్కీ హిస్టారికల్ డ్రామా సీరీస్‌కి సంబంధించినది. ఇది 2014లో మొదలై 2019 వరకు ఐదు సీజన్లుగా ప్రసారం అయింది. ఈ సీరీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ ప్రేక్షకుల్లో విపరీతంగా హిట్ అయింది. కావిట్ సెటిన్ ఇందులో ఒక కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనని విరాట్ కోహ్లీతో పోల్చడంలో క్రికెట్ వరల్డ్ లో వైరల్ అయ్యాడు. ఇదివరకూ కూడా కోహ్లీ లుక్స్‌ను పోలిన వారిని స్టేడియాల్లో, రోడ్లపై చూసిన సంగతి తెలిసిందే.
కానీ ఈసారి మాత్రం టీవీ స్క్రీన్ మీద కనిపించడంతో ఆసక్తికర చర్చ సాగింది. ఇలా సెలబ్రిటీలు ఎంతటి ప్రభావం కలిగిస్తారో, వారి లుక్స్‌ను పోలిన వ్యక్తులు ఎంత విపరీతంగా వైరల్ అవుతారో మరోసారి రుజువైంది. దీనిపై ఇంకా కోహ్లీ లేదా అనుష్క నుంచి స్పందన రాలేదప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం ఇప్పట్లో ఈ పోలికని మర్చిపోరనడంలో సందేహం లేదు.
This post was last modified on March 26, 2025 9:53 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…