అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపునకు నోచుకోని తెలుగు కథానాయిక చాందిని చౌదరి. ఆమె నటించిన షార్ట్ ఫిలిమ్స్ అన్నీ మంచి స్పందన తెచ్చుకున్నవే. సినిమాల్లోకి రావడానికి ముందే యూట్యూబ్‌లో స్టార్ అయిందామె. సోషల్ మీడియాలో ఆమెకు మాంచి ఫాలోయింగ్ ఉంది. కానీ సినిమాల్లో మాత్రం ఆమెకు ప్రతిసారీ నిరాశే వ్యక్తమవుతూ వచ్చింది.
కుందనపు బొమ్మ, మను, హౌరా బ్రిడ్జ్ లాంటి సినిమాల్లో నటించిన చాందిని వాటితో ఎలాంటి గుర్తింపు తెచ్చుకోలేదు. అలాగే విజయాలూ అందుకోలేదు. ఇంత అందమైన, బాగా నటించగల ఈ తెలుగమ్మాయికి ఒక మంచి హిట్ పడితే బావుణ్నని ఎంతోమంది అనుకున్నారు. వాళ్లు కోరుకున్న స్థాయిలో కాకపోయినా.. లేటెస్ట్ ఓటీటీ ఫిలిం ‘కలర్ ఫోటో’ చాందినికి ఓ మోస్తరుగా గుర్తింపు తెచ్చింది. ఇందులో చాందిని చేసిన దీప్తి పాత్రకు మంచి స్పందనే వచ్చింది.
ఐతే ఈ సినిమాను ఫిలిం సెలబ్రెటీలు తెగ పొగిడేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే అలా పొగుడుతున్న వాళ్లలో కొందరు చాందిని పేరును మరిచిపోతున్నారు. హీరో సుహాస్, విలన్ పాత్రధారి సునీల్, దర్శక నిర్మాతలు సందీప్ రాజ్, సాయిరాజేష్‌లను మాత్రమే ప్రశంసిస్తున్నారు. ఓవర్ లుక్‌లోనో, మరో కారణంతోనో చాందిని పేరు ప్రస్తావించట్లేదు. అది చూసి చాందిని హర్టయింది. తన పేరు ప్రస్తావించకపోవడాన్ని తప్పుబడుతూ వేసిన ట్వీట్లను రీట్వీట్ చేసిన ఆమె.. సమానత్వం కోసం ఫెమినిస్టులు పోరాడేది ఇందుకే అని, ఇది బాధాకరమైన విషయమని ఎవరి పేర్లూ ప్రస్తావించకుండా ఒక ట్వీట్ వేసింది.
తాజాగా ‘కలర్ ఫోటో’ను ప్రశంసించిన సీనియర్ నటుడు జగపతిబాబు సైతం చాందిని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. సంగీత దర్శకుడు కాలభైరవ సహా అందరినీ పొగిడి తన పేరును ప్రస్తావించకపోవడం, మరికొందరు సెలబ్రెటీలు కూడా ఇలాగే చేయడంతో చాందిని బాగా హర్టయినట్లే ఉంది. లేక లేక ఒక సినిమా మంచి స్పందన తెచ్చుకుంటే అందులోనూ తనను గుర్తించకపోవడం ఆమెను బాధించినట్లుంది.
This post was last modified on October 29, 2020 6:19 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…