వరస డిజాస్టర్లతో చిన్న బ్రేక్ తీసుకున్న వరుణ్ తేజ్ తిరిగి ట్రాక్ లోకి వచ్చేశాడు. అనవసర ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఈసారి ట్రెండ్ కు తగ్గట్టు హారర్ జానర్ ఎంచుకుని సినిమా మొదలుపెట్టేశాడు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడం ఆలస్యం నాలుగు నిమిషాల ప్రోమో వీడియోని రిలీజ్ చేయడం ద్వారా దర్శకుడు మేర్లపాక గాంధీ కొత్త పంధా ఎంచుకున్నాడు. విడుదలకు దగ్గర్లో సౌండ్ చేయడం కంటే చిత్రీకరణ దశలోనే ఆసక్తి రేపేలా చేయడం కోలీవుడ్ స్టైల్. లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ లు ఈ స్ట్రాటజీని కూలి, జైలర్ 2కి వాడి సక్సెసయ్యారు. ఇప్పడదే దారిలో వరుణ్ తేజ్ మూవీ వెళ్తోంది.
అధికారికంగా ప్రకటించలేదు కానీ దీనికి కొరియన్ కనకరాజు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇదే ఖరారయ్యే అవకాశాలు ఎక్కువని ఇన్ సైడ్ టాక్. వరుణ్ తేజ్, కమెడియన్ సత్య, మేర్లపాక గాంధీ, ఒక కొరియన్ అమ్మాయి మీద షూట్ చేసిన చిన్న గ్లిమ్ప్స్ తో కంటెంట్ ఏంటో చెప్పేశారు. హారర్ కామెడీతో పాటు కొరియన్ బ్యాక్ డ్రాప్ ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇప్పటిదాకా దెయ్యాల సినిమాలు చాలా వచ్చాయి కానీ ఇలా విదేశీ ఆత్మలను తీసుకొచ్చిమన క్యాస్టింగ్ తో హాస్యం పుట్టించడం కొత్త ఐడియా. వేగంగా పూర్తి చేసే ఈ ఏడాదే రిలీజ్ చేయాలనే టార్గెట్ తో వరసగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
సంక్రాంతికి వస్తున్నాంతో అనిల్ రావిపూడి ప్రమోషన్లకు కొత్త ఊపు తీసుకొచ్చాక దర్శకులు రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. మజాకాకు ఇలాగే చేయబోయారు కానీ వర్కౌట్ కాలేదు. రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ లకు పనవుతోంది. ఇప్పుడీ కొరియన్ కనకరాజు ఏకంగా ఇంత అడ్వాన్స్ గా ప్రచారం మొదలుపెట్టింది. అన్నట్టు ఈ ప్రోమోలోనో హీరో దర్శకుడు ఒకరికొకరు తమ ఫ్లాపుల మీద జోకులు వేసుకోవడం కొసమెరుపు. సత్యకు ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కిందని అర్థమవుతోంది. అశోక వనంలో అర్జున కళ్యాణం ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ హారర్ డ్రామాలో షాకింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉంటాయట.
This post was last modified on March 26, 2025 2:27 pm
ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా జనసేన కీలక నేత కందుల దుర్గేశ్ సత్తా చాటుతున్నారని చెప్పాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పర్యాటక…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ…
పోలవరం ప్రాజెక్టు… ఏపీకి జీవనాడి. జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే…
అంతా సిద్దమనుకుని ఇంకాసేపట్లో షోలు పడతాయన్న టైంలో హఠాత్తుగా విడుదల ఆగిపోతే ఆ నిర్మాతలు పడే నరకం అంతా ఇంతా…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నేతృత్వంలోని గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ ఏపీకి వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు ఇప్పటికే…
ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్స్ గురించి సోషల్ మీడియా మంచి…