రేపు విడుదల కాబోతున్న ఎల్2 ఎంపురాన్ దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ కి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. వంద కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టిన మొదటి మలయాళం సినిమాగా దీని మీద మాములు అంచనాలు లేవు. దానికి తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. సలార్ విలన్, ఎస్ఎస్ఎంబి 29 లీడ్ ఆర్టిస్ట్ గా మనకూ దగ్గరవుతున్న ఈ విలక్షణ నటుడికి డైరెక్టర్ గా పెద్ద సవాల్ ఎదురు చూస్తోంది. హీరో మోహన్ లాల్ ని వెంటేసుకుని ఎడతెరిపి లేకుండా గత వారం పది రోజుల నుంచి రాష్ట్రాలన్నీ చుట్టేస్తూ ప్రమోషన్లు చేస్తున్నాడు. ప్రెస్ మీట్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలంటూ అంతా ఆయనే కనిపిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో పృథ్విరాజ్ ఇండస్ట్రీలో ఉన్న పరిణామాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే చూద్దాం. “సినిమా అనేది ఎప్పుడూ ఒకేరకమైన స్థిరమైన లాభాలు ఇచ్చే వ్యాపారం కాదు. ఎక్కువ రిస్క్ ఉన్న పరిశ్రమగా గుర్తింపుతో పాటు ఎక్కువ ఫెయిల్యూర్ శాతం దక్కుతున్న ఇండస్ట్రీ కూడా ఇదే. ఇప్పుడంటే ఛానల్స్ పెరిగిపోయి, సోషల్ మీడియా పాకిపోయి సమాచారం సులభంగా తెలుస్తోంది కానీ గతంలోనూ ఇలాగే ఉంది. 2024లో 200 మలయాళం సినిమాలు రిలీజైతే వాటిలో 24 మాత్రమే సక్సెసయ్యాయి. మిగిలినవి కనీస స్థాయిలో ఆడలేకపోయాయి”.
మరి ఇన్ని నష్టాలు నమోదవుతున్నప్పుడు ఎందుకు నిర్మాణాలు కొనసాగుతాయంటే సమాధానం సింపుల్. ఏవైతే సినిమాలు వర్క్ అవుతున్నాయో వాటి ద్వారా వచ్చే లాభాలు నిర్మాతలకు 300 నుంచి 400 శాతం దాకా లాభాలు ఇస్తున్నాయి. ఇది పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. పోయిన చోటే వెతుక్కోమని ప్రోత్సహిస్తోంది. ఇది ఒకరకమైన గ్యాంబ్లింగ్ లాంటిదే”. చూశారుగా అరటిపండు వలిచినట్టు పృథ్విరాజ్ చెప్పిన చేదు వాస్తవాలు. మల్లువుడ్ అంత తీవ్రంగా టాలీవుడ్ ఫెయిల్యూర్ రేట్ లేదు కానీ వీలైనంత కంటెంట్ మీద దృష్టి పెట్టి మరిన్ని మంచి సినిమాలు తీయాల్సిన అవసరం అందరి మీదా ఉంది.
This post was last modified on March 26, 2025 11:12 am
బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నిర్మాతలు పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. మాములుగా మన దగ్గర స్టార్ హీరో రిలీజ్…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ సేవా కార్యక్రమాలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. ఇప్పటికే తన మనసుకు…
బాలీవుడ్ కు గ్యాంగ్స్ అఫ్ వసేపూర్, బ్లాక్ ఫ్రైడే ఇచ్చిన దర్శకుడిగా అనురాగ్ కశ్యప్ కు మంచి పేరుంది. ఇప్పుడంటే…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి హఠాత్తుగా మళ్ళీ పుకార్లు మొదలైపోయాయి. హైదరాబాద్ కు…
టాలీవుడ్ లో పునర్జన్మలది సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు. ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ కథతో వచ్చాయి. ఏఎన్ఆర్ మూగ…
మార్చి నెలాఖరులో మొదటి రౌండ్ బాక్సాఫీస్ ఫైట్ నిన్న పూర్తయ్యింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఎల్2 ఎంపురాన్ ఇతర భాషల్లో…