Movie News

రామ్ చరణ్ పుట్టినరోజుకు ‘పెద్ది’ వస్తాడా

ఎల్లుండి రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు ఒక క్రేజీ కంటెంట్ ఆశిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆర్సి 16 టీజర్ కోసం వాళ్ళ ఎదురు చూపులు మాములుగా లేవు. అయితే ఇక్కడో చిక్కు ఉంది. టీజర్ కట్ సిద్ధంగా ఉంది కానీ ఇంకా రీ రికార్డింగ్ మిక్స్ జరగలేదు. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ చెన్నైలో అదే పని మీద ఉన్నారట. దర్శకుడు బుచ్చిబాబు అక్కడికి చేరుకున్నట్టు సమాచారం. ఒకవేళ ఇంత తక్కువ టైంలో కనక క్వాలిటీ బిజిఎం ఇచ్చేలా అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మే 27న టైం కొంచెం అటు ఇటు అయినా సరే ఫ్యాన్స్ కి వీడియో కానుక ఇవ్వొచ్చు.

థియేటర్ స్క్రీనింగ్ కి సమయం సరిపోకపోవచ్చు. ఎందుకంటే సెన్సార్ జరగాలి. ఆఘమేఘాల మీద దీన్ని చేయించుకున్నా క్యూబ్ తదితర మాధ్యమాల్లో అప్లోడ్ చేసి థియేటర్లకు అందుబాటులోకి తీసుకురావడం పెద్ద తతంగం. నాయక్ రీ రిలీజ్ ఆడుతున్న చోట వేసినా చాలనేది ఫ్యాన్స్ అభిప్రాయం. అది జరగాలన్నా టీజర్ అనుకున్న స్థాయిలో సంతృప్తికరంగా రెడీ అయిపోవాలి. నెలల తరబడి ప్రచారంలో ఉన్న పెద్ది టైటిల్ నే ఖరారు చేశారని ఇన్ సైడ్ టాక్. అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని, టీజర్ చూశాక ఒక్కసారిగా అంచనాలు పెరుగుతాయని అంటున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ రామ్ చరణ్ అమ్మమ్మ (అల్లు రామలింగయ్య గారి సతీమణి) ప్రస్తుతం అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం కొంత నిలకడగా ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితిలో సెలబ్రేషన్ కు చరణ్ ఒప్పుకోకపోవచ్చు. సో జస్ట్ ఆన్ లైన్ లాంఛ్ తో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. గేమ్ ఛేంజర్ చేసిన గాయం, తర్వాత అది ట్రోలింగ్ అయ్యేలా జరిగిన పరిణామాలు మెగా ఫ్యాన్స్ ని కలవరానికి గురి చేశాయి. ఒక్కసారిగా అదంతా మటుమాయం అయ్యే స్థాయిలో పెద్ది టీజర్ వచ్చిందనే మాట వినిపిస్తోంది. విడుదల తేదీ వచ్చే ఏడాది మార్చి 26 అనే ప్రచారం నిజామా కాదా అనేది కూడా తేలిపోవచ్చు.

This post was last modified on March 25, 2025 3:35 pm

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 minutes ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

5 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

6 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

6 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

6 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

9 hours ago