తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమాగా నిర్మాణంలో ఉన్న జన నాయగన్ విడుదల తేదీ వచ్చేసింది. 2026 జనవరి 9న తలపతి లాస్ట్ మూవీ చూడమని పిలుపు ఇచ్చేశారు. ఇది ఇంతకు ముందే లీకైనప్పటికీ ఈ ఏడాది దీపావళికి రావొచ్చని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ నిర్మాతల ప్లాన్లు వేరే ఉన్నాయి. నిజానికి ఈ తేదీ ఎంచుకోవడం వెనుక తెలివైన స్ట్రాటజీ కనిపిస్తోంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) అదే పండక్కు వస్తానని ఎప్పుడో చెప్పింది. కానీ డేట్ నిర్ణయించుకోలేదు. ఇప్పుడు జన నాయగన్ తెలివిగా కర్చీఫ్ వేయడంతో ఇతరులు వేరే తేదీలు చూసుకోవాలి.
ముందు నుంచి ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం జరుగుతున్నా నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అప్పుడప్పుడు పలు సందర్భాల్లో నటీనటులు టెక్నీషియన్లు చూచాయగా చెప్పడం తప్పించి కనీసం ట్రైలర్ వస్తే తప్ప అందులో ఎంత నిజముందో చెప్పలేం. జన నాయగన్ లో పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు మరో కీలక పాత్ర పోషించింది. బాబీ డియోల్, అరుణ్ విజయ్ తదితరులున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా విజయ్ చివరి సినిమా కాబట్టి కోలీవుడ్ లో కనివిని ఎరుగని రిలీజ్ ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ కాంపిటీషన్ ఉండకపోవచ్చు.
ఇప్పుడు విజయ్ ఎంట్రీ వల్ల మన సంక్రాంతి రేసులో మొత్తం ముగ్గురున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో సినిమా కూడా ఇదే సీజన్ లో రానుంది. దానికి తగ్గట్టే ప్రణాళికలు వేస్తున్నారు. విజయ్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. హక్కులు పెద్ద సంస్థలే తీసుకుంటాయి. అదే జరిగిన పక్షంలో పోటీ టఫ్ గా ఉంటుంది. రాజకీయ, సామజిక అంశాలు ఎక్కువగా ఉండేలా దర్శకుడు హెచ్ వినోత్ జన నాయగన్ ను తీర్చిదిద్దినట్టు టాక్. నిజంగానే విజయ్ ఇకపై సినిమాలు చేయడా లేక రాజకీయాల్లో సక్సెస్ ఫెయిల్యూర్ ని బట్టి నిర్ణయాలు మార్చుకుంటాడా తేలాలంటే ఎన్నికల దాకా ఆగాలి.
This post was last modified on March 24, 2025 7:09 pm
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…