సినిమాల్లో అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా సోషల్ మీడియాలో సూపర్ పాపులారిటీ ఉన్న అందాల భామల్లో మాళవిక మోహనన్ ఒకరు. ఉత్తరాదికి దిశా పటాని ఎలాగో దక్షిణాదికి మాళవిక అలా అని చెప్పొచ్చు. హాట్ హాట్ ఫొటో షూట్లతో కుర్రకారుకు కిర్రెక్కిస్తూ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంది మాళవిక. కానీ ఆమె కోరుకున్న బ్లాక్ బస్టర్ సక్సెస్ మాత్రం ఇంకా దక్కలేదు. ఇప్పటిదాకా ఆమె నటించిన చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. ఈ స్థితిలో తన ఆశలన్నీ ప్రభాస్ మూవీ ‘రాజా సాబ్’ మీదే ఉన్నాయి.
ఈ సినిమా తన కెరీర్‌కు గేమ్ చేంజర్ అవుతుందని ఆమె ఆశిస్తోంది. ఇందులో మాళవిక సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె తెలుగు క్లాసులు కూడా తీసుకుంటోందట. ఓ ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ.. ఏ ఇండస్ట్రీలో నటించినా ఆ భాష నేర్చుకుంటే మెరుగ్గా నటించడానికి అవకాశముంటుందని చెప్పింది. అందులోనూ తెలుగు ఇండస్ట్రీ ఎంతో ఎదిగిపోయిందని.. బాలీవుడ్‌తో సమానమైన ఇండస్ట్రీ అదని.. అలాంటపుడు ఆ భాష నేర్చుకుని నటిస్తే మంచిది కదా అని ఆమె వ్యాఖ్యానించింది. అందుకే తెలుగు క్లాసులు తీసుకుని ఆ భాష మీద పట్టు సంపాదిస్తున్నట్లు చెప్పింది.
ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. అతను చాలా రిజర్వ్డ్ పర్సన్ అని.. తన చుట్టూ ఉన్న తక్కువ మందితో మాత్రమే మాట్లాడతాడని మాళవిక వ్యాఖ్యానించింది. ప్రభాస్ వ్యక్తిగా చాలా మంచి వాడని.. తనతో పని చేయడం మంచి అనుభవమని తెలిపింది. ప్రభాస్ పెట్టే ఫుడ్ భలే ఉంటుందని.. చాలా రుచికరంగా వంటలు చేయిస్తాడని మాళవిక వ్యాఖ్యానించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’లో మాళవికతో పాటు నిధి అగర్వాల్ కూడా ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆ చిత్రం విడుదలవుతుంది.
This post was last modified on March 24, 2025 4:29 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…