ఈ వారం విడుదల కాబోతున్న స్ట్రెయిట్ సినిమాల్లో బడ్జెట్ పరంగా రాబిన్ హుడ్ పెద్దది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా ప్రమోషన్లు జోరుగా చేశారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే ఇందులో క్యామియో చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్న వైనం అన్ని చోట్ల కనిపిస్తోంది. ఎయిర్ పోర్ట్ లో దిగడంతో మొదలుపెట్టి స్టేజి మీద డాన్స్ చేయించడం దాకా ఎంత హైలైట్ అవ్వాలో అంతకు మించే అనేలా హడావిడి చేస్తున్నారు. నిజానికి తను రాబిన్ హుడ్ లో చేసింది చిన్న పాత్ర. అది కూడా కొన్ని నిమిషాలట.
దానికి ఇంత పబ్లిసిటీ ఎందుకనే సందేహం రావడం సహజం. అసలు డేవిడ్ వార్నర్ ఫామ్ లో లేడు. ఈ కారణంగానే ఐపీఎల్ 2025లో అమ్ముడు పోలేదు. ఒకప్పుడు భీభత్సమైన ఆటతో హైదరాబాద్ సన్ రైజర్స్ తరఫున ట్రాక్ రికార్డు మైంటైన్ చేశాడు కానీ అదంతా గతం. ఇప్పుడు ఫ్యాన్స్ ట్రావిస్ హెడ్, క్లాసెన్, కమ్మిన్స్ వైపు షిఫ్టయిపోయారు. ఈ నేపథ్యంలో కేవలం వార్నర్ కోసమే థియేటర్లకు వచ్చే ఆడియన్స్ మరీ భారీగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు రాబిన్ హుడ్ లో ఉన్న ఇతర ఎన్నో అంశాలను హైలైట్ చేయకుండా ఒక క్రికెటర్ నే ఇంతగా వాడుకోవడం గురించి కామెంట్లు రావడంలో ఆశ్చర్యం లేదు.
వీటికి సమాధానం మార్చి 28 దొరుకుతుంది కానీ ఒకవేళ నిడివి మరీ తక్కువున్నా లేదా ప్రాధాన్యం అంతగా అనిపించకపోయినా ఇదే నెగటివ్ గా మారే ప్రమాదం లేకపోలేదు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కామెడీతో పాటు శ్రీలీల గ్లామర్, కేతిక శర్మ ఐటెం సాంగ్, నితిన్ మార్క్ కామెడీ ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా దట్టించుకున్న రాబిన్ హుడ్ ఖచ్చితంగా కెరీర్ బెస్ట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు నితిన్. మ్యాడ్ స్క్వేర్, ఎల్2 ఎంపురాన్, వీరధీరశూర పార్ట్ 2తో పోటీ గట్టిగానే ఉంది కానీ వినోదం, యాక్షన్ రెండు కలగలిసిన తమ సినిమా రేసులో ముందుంటుందనే కాన్ఫిడెన్స్ రాబిన్ హుడ్ టీమ్ లో ఉంది
This post was last modified on March 24, 2025 10:35 am
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం…
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్నది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ప్రతి కొత్త దర్శకుడికీ ఓ కల. ఒక తరాన్ని ఊపు…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విజనరీ నేతే. ఈ విషయాన్ని వైరి వర్గాలు ఎంత విమర్శించినా.. ఆ…
ఒకప్పుడు అపరిచితుడు టైంలో విక్రమ్ సినిమాల ఓపెనింగ్స్ కి ట్రేడ్ మతులు పోయేవి. తర్వాత వచ్చే వాటికి డిమాండ్ పెరిగి…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. 2.0పై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జగన్ 2.0 చాలా భి…
వైసీపీ తరఫున గత ప్రభుత్వంలో ఉండి.. పార్టీని, అప్పటి సీఎం జగన్ను కూడా హైలెట్ చేసిన వారు.. అదేసమయంలో అప్పటి…