Movie News

దొంగల భరతం పట్టే క్రేజీ ‘రాబిన్ హుడ్’

ఛలో, భీష్మ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల తన రెండో సినిమా హీరో నితిన్ తో రెండోసారి జత కట్టి రాబిన్ హుడ్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ప్రమోషన్ల పరంగా వెరైటీ స్ట్రాటజీ అనుసరిస్తున్న ఈ బృందం ఇదిదా సర్ప్రైజ్ పాటతో పబ్లిసిటీ బాగానే చేసుకుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఎంటర్ టైనర్ కు జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. పోటీ ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా హిట్టు కొడతామనే నమ్మకం టీమ్ లో కనిపించింది. కంటెంట్ దాచకుండా కథేంటో వీడియోలో చూపించేశారు.

అతని పేరు రామ్ అలియాస్ రాబిన్ హుడ్ (నితిన్). దోచుకురమ్మంటే కాల్చుకు వచ్చే రకం. ఏజెన్సీ నడిపే ఒక పెద్ద మనిషి (రాజేంద్ర ప్రసాద్) దగ్గర పని చేస్తూ ఉంటాడు. దొంగతనాలు, అండర్ కవర్ ఆపరేషన్లతో అలా నెట్టుకుంటూ వస్తున్న రామ్ జీవితంలోకి ఒక ఎన్ఆర్ఐ అమ్మాయి నీరా వాసుదేవ్ (శ్రీలీల) వస్తుంది. ఆమె సెక్యూరిటీ బాధ్యతను తీసుకుంటాడు. అయితే ఒక మారుమూల కొండప్రాంతంలో చట్టవిరుద్ధంగా మాదకద్రవ్యాలు సాగు చేస్తున్న సామి (దేవదత్త నాగ) సామ్రాజ్యంలోకి రాబిన్ హుడ్ అడుగుపెడతాడు. ఇక అక్కడి నుంచి ఛేజులు, ఫైట్లు. తర్వాత జరిగేదే స్టోరీ..

ఎంటర్ టైన్మెంట్, యాక్షన్, క్రైమ్ అన్ని సమపాళ్లలో మిక్స్ చేసిన వెంకీ కుడుముల ఈసారి బడ్జెట్ స్కేల్ పెంచేసి దానికి తగ్గట్టే క్వాలిటీని చూపించాడు. డైలాగుల్లో తనదైన మార్కు కనిపించింది. ఫోర్ ఫాదర్స్ అంటూ వెన్నెల కిషోర్ వేసిన జోకు, జెడ్ ప్లస్ క్యాటగిరీ కామెడీ వగైరాలు నవ్వించేలా ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా పవర్ ఫుల్ విలన్ బ్లాక్ కూడా సెట్ చేసిన వెంకీ కుడుముల హీరో నితిన్ ని రకరకాల గెటప్స్ లో చూపించాడు. మార్చి 28 విడుదల కాబోతున్న రాబిన్ హుడ్ నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తున్నారో అది ఉందనే నమ్మకం ట్రైలర్ లో ఇచ్చారు. ఇక థియేటర్లో మెప్పించడమే తరువాయి.

This post was last modified on March 23, 2025 10:04 pm

Share

Recent Posts

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

2 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

4 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

5 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

6 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

6 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

7 hours ago