Movie News

శ్రీలంకలో ‘కింగ్ డమ్’ ఏం చేయబోతున్నాడు

మే 30 విడుదల కాబోతున్న కింగ్ డమ్ కౌంట్ డౌన్ ఇంకో అరవై ఏడు రోజులు మాత్రమే ఉంది. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మీద నాగవంశీ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మరోసారి శ్రీలంకకు వెళ్తోంది. ఒక సాంగ్ షూట్ కోసం అయిదు రోజులు అక్కడే ఉండి పూర్తి చేసుకుని వస్తుంది. ఇది గ్రూప్ సాంగని ఇన్ సైడ్ టాక్. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన హై ఎమోషనల్ సాంగ్ ని భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులతో అవుట్ డోర్, సెట్స్ లో తీయబోతున్నట్టు సమాచారం.

ఇన్నిసార్లు కింగ్ డమ్ శ్రీలంకలో షూటింగ్ జరుపుకోవడానికి అసలు కారణం దీని నేపధ్యమే అని తెలిసిన విషయమే అయినా మరికొన్ని కీలక లీక్స్ ఆసక్తి రేపేలా ఉన్నాయి. ఒకప్పుడు శ్రీలంకలో తమిళనాడు శరణార్థులది పెద్ద చరిత్ర. వీళ్ళ కోసమే ఎల్టిటిఐ స్థాపించి తీవ్రవాదాన్ని పెంచి పోషించిన ప్రభాకరన్ కొన్ని లక్షల మందికి ఆరాధ్యుడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు దారి తీసిన పరిస్థితులకు మూలం శ్రీలంక నుంచే మొదలయ్యింది. కింగ్ డమ్ లో ఈ నిజజీవిత సంఘటనలు కొన్ని తీసుకుని అణిచివేయబడుతున్న తెగల నాయకుడిగా విజయ్ దేవరకొండ ఉద్భవించే వైనం టెర్రిఫిక్ గా ఉంటుందట.

ఇక్కడ చెప్పింది చాలా కొంతే కానీ స్క్రీన్ మీద ఊహించని స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలిసింది. రెండు భాగాలనే ప్రచారం ముందు నుంచి ఉంది కానీ ఫలితం బట్టి ఈ నిర్ణయంలో మార్పులు ఉండే అవకాశం లేకపోలేదు. అయితే కంటెంట్, లాజిక్స్, యాక్షన్, గ్రాండియర్ ఇలా అన్ని టిక్ బాక్సులకు సమాధానం ఇచ్చే స్థాయిలో కింగ్ డమ్ ఉంటుందని నాగవంశీ పదే పదే చెప్పడం చూసి ఫ్యాన్స్ చాలా నమ్మకం పెట్టేసుకున్నారు. ఏప్రిల్ రెండో వారంలో ప్రమోషన్లు ప్లాన్ చేస్తారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రోగ్రాంలు, టూర్లు చాలానే ఉంటాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ శ్రీలంకలో చేసే ఛాన్స్ ఉంది.

This post was last modified on March 23, 2025 3:04 pm

Share

Recent Posts

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

36 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

55 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

59 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

2 hours ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

5 hours ago

నార్త్ రాముడు.. సౌత్ శివుడు… రేవంత్ కరెక్టేనా?

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…

5 hours ago