బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ఆమిర్ ఖాన్.. ఒక్కో సినిమా చాలా గ్యాప్ తీసుకుంటాడు. ఒక సినిమా మేకింగ్ కోసం కూడా చాలా టైం పెడతాడు. అందుకే మూడేళ్లకో సినిమా కానీ రాదు ఆమిర్ నుంచి. ఐతే ఆమిర్ నుంచి హిట్లు వస్తుంటే ఇలా గ్యాప్ వచ్చినా పర్వాలేదు కానీ.. ఆయన చివరగా సక్సెస్ అందుకుంది 2016లో వచ్చిన ‘దంగల్’ మూవీతో. ఆ తర్వాత ఆయన లీడ్ రోల్ చేసిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లాల్ సింగ్ చడ్డా’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. ‘లాల్ సింగ్ చడ్డా’ ఫెయిల్యూర్ ఆమిర్ మీద తీవ్ర ప్రభావమే చూపింది. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చాడు.
తర్వాత తాను గెస్ట్ రోల్‌లో నటిస్తూ ‘సితారే జమీన్ పర్’ సినిమా తీస్తున్నాడు. ఐతే ఆమిర్ లీడ్ రోల్ చేసే సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ అదెప్పుడు ఉంటుందో తెలియదు. ఐతే సినిమా ముచ్చట్లు పెద్దగా పంచుకోలేకపోతున్నప్పటికీ.. ఈ మధ్య వ్యక్తిగత జీవితం విషయమై తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు ఆమిర్. 60వ పడిలో అడుగు పెడుతూ మూడో పెళ్లికి రెడీ అవుతున్న ఆమిర్.. తాను కొత్తగా డేటింగ్ చేస్తున్న మహిళ గురించి ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన గత బంధాల గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడుతున్నాడు ఆమిర్.
తన మొదటి భార్య రీనా దత్తాతో విడాకులు తీసుకున్న రోజుల గురించి అతను తాజాగా గుర్తు చేసుకున్నాడు. విడాకుల తర్వాత ఒక దశలో బాధ తట్టుకోలేక రోజుకో మందు బాటిల్ లేపేసేవాడినని ఆమిర్ చెప్పడం విశేషం. ‘‘రీనాతో విడిపోయాక నేను చాలా బాధ పడ్డా. దాదాపు మూడేళ్లు ఆ బాధ నన్ను వెంటాడింది. పని మీద దృష్టిపెట్టలేకపోయా. సినిమాలకు దూరమయ్యా. కథలు వినలేదు. ఇంట్లో ఒంటరిగా కూర్చుని బాధ పడేవాడిని. నిద్ర పట్టేది కాదు. ఏం చేయాలో అర్థం కాలేదు. నిద్ర పట్టడం కోసం మందు తాగడం అలవాటు చేసుకున్నా.
ఆల్కహాల్ గురించి ఏమీ తెలియని నేను రోజుకో బాటిల్ లేపేసే స్థితికి చేరుకున్నా. ఏడాదిన్నర పాటు దానికి బానిస అయ్యాను. దేవదాసులా అయ్యాను. డిప్రెషన్‌లోకి వెళ్లాను. ఈ బాధ నుంచి బయటపడడానికి చాలా సమయమే పట్టింది. నెమ్మదిగా పరిస్థితులను అర్థం చేసుకున్నా. ఇష్టపడిన వారు పక్కన లేకున్నా జీవించడం అలవాటు చేసుకున్నా’’ అని ఆమిర్ చెప్పాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన రీనాను 1986లో పెళ్లి చేసుకున్న ఆమిర్.. 2002లో ఆమె నుంచి విడిపోయాడు.
This post was last modified on March 23, 2025 1:12 pm
ఇండియాలో ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ ఏది అంటే.. ఎక్కువమంది ‘ఫ్యామిలీ మ్యాన్’ పేరే చెబుతారు. దీన్ని మించిన…
ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేసే విషయంలో భారత కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఎప్పుడూ ముందుంటారు. ఆయన కొనుగోలు…
సిద్ధు జొన్నలగడ్డ కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పిన సినిమా.. డీజే టిల్లు. చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించిన…
రేపు విడుదల కాబోతున్న సికందర్ ప్రమోషన్లలో భాగంగా సల్మాన్ ఖాన్ ఇస్తున్న ఇంటర్వ్యూలో కొన్ని మాటలు భలే విచిత్రంగా అనిపిస్తున్నాయి.…
తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
ఏప్రిల్ 25 విడుదల కావాల్సిన కన్నప్ప వాయిదా పడింది. ఒక కీలక ఎపిసోడ్ కు సంబంధించిన విఎఫ్ఎక్స్ కు ఎక్కువ…