తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టిన చాలామంది ఉత్తరాది హీరోయిన్లు ఇక్కడి అమ్మాయిల్లా మారిపోయిన వారే. అందరికీ నమస్కారం అని కష్టపడి రెండు ముక్కలు తెలుగు మాట్లాడే టైపు హీరోయిన్లు కాదు వీళ్లు. కొంత కాలంలోనే తెలుగులో పట్టు సంపాదించి చక్కగా మన భాషలో మాట్లాడుతూ మన అభిమానుల మనసు దోచిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. తమన్నా, రకుల్ ప్రీత్, రాశి ఖన్నా.. ఇలా ఈ జాబితాలో చాలామందే కనిపిస్తారు. వీరిలో తమన్నా కెరీర్ ఆరంభంలోనే తెలుగు మీద పట్టు సంపాదించింది. పలు చిత్రాల్లో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది.
ఆమె అత్యధికంగా సినిమాలు చేసింది కూడా తెలుగునే అన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య టాలీవుడ్లో ఆమె సినిమాలు తగ్గాయి. తన కొత్త చిత్రం ఓదెల-2 మంచి బజ్ తెచ్చుకుని ఏప్రిల్ 17న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర బృందం ప్రెస్ మీట్ పెట్టగా.. అందులో తనకున్న తెలుగు ఐడెంటిటీ గురించి తమన్నా మాట్లాడింది. తాను దేశంలో ఎక్కడికి వెళ్లినా తెలుగమ్మాయిలాగే చూస్తారని తమన్నా వ్యాఖ్యానించింది. అలాగే తనకు తాను తెలుగమ్మాయిలా ఫీలవుతానని చెప్పింది. తెలుగు సినిమాలతో, ఇక్కడి అభిమానులతో తనకు అంతగా కనెక్షన్ ఉందని తమన్నా వ్యాఖ్యానించింది.
తాను తెలుగుకు ఎంతగా అలవాటు పడిపోయానో చెబుతూ.. తనకు కోపం వస్తే తిట్లు కూడా తెలుగులోనే వస్తున్నాయని ఆమె వెల్లడించింది. ఈ మధ్య ఓ సందర్భంలో తన డ్రైవర్ మీద కోపం వస్తే తెలుగులోనే తిట్టు వచ్చిందని.. అప్పుడే తన జీవితంలో తెలుగు ఎలా అంతర్భాగం అయిపోయిందో అర్థమైందని తమన్నా చెప్పింది. ఇక ఈ ఈవెంట్లో చిత్ర నిర్మాత, కథకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. తమన్నా డెడికేషన్ ఎలాంటిదో చెప్పాడు. రచ్చ సినిమాలో వాన పాట కోసం తమన్నా ఎంత కష్టపడిందో తనకు మాత్రమే తెలుసని చెప్పాడు. ఓదెల-2 షూటింగ్‌లో హెవీ కాస్ట్యూమ్స్ వేసుకుని 47 డిగ్రీల ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా షూటింగ్‌లో పాల్గొందని.. పదేళ్ల ముందు రచ్చ సినిమా టైంలో ఎలాంటి డెడికేషన్ ఉండేదో.. ఇప్పుడూ అంతే అని.. ఎంత పెద్ద స్టార్ అయినా తనలో ఏ మార్పూ లేదని సంపత్ చెప్పాడు.
This post was last modified on March 23, 2025 6:08 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…