తెలుగులో ఇప్పుడు సీక్వెల్స్, ఫ్రాంఛైజీ చిత్రాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి కానీ.. ఒకప్పుడు ఆ తరహా చిత్రాలు చాలా తక్కువగా ఉన్న టైంలో వచ్చిన మూవీ ‘ఆర్య-2’. బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆర్య’కు పని చేసిన అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన సినిమా కావడం, ‘ఆర్య-2’ అనే టైటిల్ పెట్టడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. ఐతే సుకుమార్ మిగతా ఫ్లాప్ చిత్రాల్లాగే రిలీజ్ తర్వాత ఇది కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది.
చాలామంది ‘ఆర్య-2’ను ఫేవరెట్ మూవీ అంటుంటారు. అందులో సెలబ్రెటీలు కూడా ఉన్నారు. ‘మ్యాడ్’ మూవీతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్‌కు కూడా ‘ఆర్య-2’ మోస్ట్ ఫేవరెట్ అట. ఐతే ఈ సినిమాకు టైటిలే మైనస్ అని అతను అభిప్రాయపడ్డాడు. తాను చూసిన వాటిలో బెస్ట్, వరస్ట్ సీక్వెల్స్ గురించి కళ్యాణ్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘‘దృశ్యం-2 నాకు నచ్చిన బెస్ట్ సీక్వెల్. దృశ్యం సినిమా నాకు చాలా నచ్చింది. కానీ దాన్ని మించి దృశ్యం-2 అద్భుతంగా అనిపించింది. ఇక నాకు అస్సలు నచ్చని సీక్వెల్ అంటే.. నాగవల్లి. నా చిన్నతనంలో ‘చంద్రముఖి’ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అలాంటి సినిమాకు సీక్వెల్ అని చూస్తే ‘నాగవల్లి’ ఏమాత్రం నచ్చలేదు. మొత్తం మిస్ ఫైర్ అయింది.
‘ఆర్య’కు కొనసాగింపుగా వచ్చిన ‘ఆర్య-2’ నా ఫేవరెట్ మూవీ. నిజానికి అది సీక్వెల్ కాదు. ఆర్య-2 అని పెట్టడంతో సీక్వెల్ అనుకున్నారు. ఆ కథకు, ఈ కథకు సంబంధం లేదు. అలా కాకుండా ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లాంటి టైటిల్ పెడితే బాగుంటుంది. ఆ సినిమా స్క్రీన్ ప్లే భలేగా ఉంటుంది. అందులో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య స్నేహాన్ని చాలా కొత్తగా చూపించారు. ఒక సీన్ చూసి హీరో చెడ్డవాడు అనుకుంటాం. కానీ తర్వాతి సీన్లోనే జస్టిఫికేషన్ ఉంటుంది. నాకు సుకుమార్ గారి హిట్ సినిమాల కంటే ఫ్లాప్ మూవీస్ చాలా ఇష్టం. ఆర్య-2, 1 నేనొక్కడినే, జగడం.. ఇవన్నీ చాలా నచ్చుతాయి’’ అని కళ్యాణ్ శంకర్ తెలిపాడు.
This post was last modified on March 22, 2025 4:23 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…