ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండగ తొలి సినిమాగా వచ్చిన గేమ్ ఛేంజర్ ముమ్మాటికీ డిజాస్టరే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇంతకన్నా ఫ్లాపులు టాలీవుడ్ గతంలో చూడలేదనే రీతిలో తరచుగా జరుగుతున్న డిబేట్లు, వస్తున్న కామెంట్లు అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాయి. ఆ మధ్య తండేల్ ఈవెంట్ లో దిల్ రాజుని పొగిడే ఉద్దేశంతో అల్లు అరవింద్ గేమ్ ఛేంజర్ మీద వేసిన పంచ్ చివరికి ఆయనతోనే క్షమాపణ చెప్పే దాకా తీసుకొచ్చింది. ఇవాళ జరిగిన ఎల్2 ఎంపురాన్ ప్రెస్ మీట్ లో ఈ మూవీ ప్రస్తావనప్పుడు వచ్చిన మీడియాలో కొందరు ఘొల్లున నవ్వడం అనవసరంగా హైలైటయ్యింది.
రెమ్యునరేషన్ల గురించి గేమ్ ఛేంజర్ టాపిక్ వచ్చినప్పుడు దిల్ రాజు నవ్వుతూనే ప్రాజెక్టు మొదలైనప్పుడు ఎవరికీ రెమ్యునరేషన్లు లేకుండా ప్రాఫిట్ షేరింగ్ మోడల్ లోనే ఉందని తర్వాత ఏం జరిగిందో చెప్పకుండా టాపిక్ మార్చేయడం మరోసారి నవ్వులకు తావిచ్చింది. సినీ చరిత్రలో డిజాస్టర్లు లేని హీరో ఉండరు. చాలా సంవత్సరాల క్రితం ఒక సినిమా నష్టం దెబ్బకు నిర్మాత హుసేన్ సాగర్ లో దూకి ఆత్యహత్య ప్రయత్నం చేయడం మీడియాలో వచ్చింది. అంతకన్నా ముందు కోట్లు పెట్టుబడి పెట్టిన అగ్ర నిర్మాత ఒకరు ఫలితం తేడా కొట్టేసరికి ఏకంగా ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్ళిపోయి వేరే వ్యాపారం చేసుకున్నారు.
ఇలా చాలా ఫ్లాపులు ఎందరో దర్శకులకు కెరీర్లు లేకుండా చేశాయి. లెక్క పెట్టలేనంత నిర్మాతలను నడి సముద్రంలో ముంచేశాయి. టాప్ లీగ్ లో ఉంటూ కోట్లు తీసుకునే డైరెక్టర్లు షెడ్డుకి వెళ్ళిపోయిన ఉదంతాల గురించి రాస్తే పుస్తకాలు సరిపోవు. కాబట్టి ఇది గేమ్ ఛేంజర్ తో మొదలయ్యింది కాదు, తర్వాత ఆగేది కాదు. భవిష్యత్తులో ఇంతకన్నా దారుణమైన ఫ్లాపులు రావొచ్చు. కానీ వాటిని హుందాగా అంగీకరించాలి, అక్కడితో వదిలేసి కొత్తవాటి మీద ప్రయాణం చేయాలి. ఒకవేళ కావాలని ఎవరైనా ప్రస్తావన తీసుకొచ్చినా జరిగిందేదో జరిగిందనే తరహాలో స్మార్ట్ గా తప్పించుకోవాలి కానీ మనమూ ట్రోలింగ్ లో భాగం కాకూడదు.
జరుగుతున్న వాటిలో దిల్ రాజు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పేం లేకపోవచ్చు. కానీ గేమ్ ఛేంజర్ లాంటి ఫలితాలు ఆయన కొత్తగా చూడటం లేదు. గతంలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. ఫ్యామిలీ స్టార్ పోయినప్పుడు ఇంత నెగటివిటీ రాలేదు. గేమ్ ఛేంజర్ కే ఎందుకు వచ్చిందంటే యాంటీ ఫ్యాన్స్ ప్రమేయం వల్ల సోషల్ మీడియా ప్రభావితం చేసి ఉండొచ్చని కొందరు అంటారు. కారణం ఎవరైనా అవసరానికి మించి గేమ్ ఛేంజర్ టార్గెట్ కావడం సరికాదు. రేపు ఇంకో హీరోది ఇలాంటి ఫ్లాప్ వచ్చినప్పుడు అపోజిషన్ దాన్నో ట్రెండ్ గా మార్చేస్తారు. దీని వల్ల కలెక్షన్లు దెబ్బ తింటాయి. ఇవి అత్యవసరంగా గుర్తించాల్సిన సత్యం.
This post was last modified on March 22, 2025 3:21 pm
స్థానిక సంస్థల్లో వైసీపీ పట్టుకోల్పోతోంది. 2021లో జరిగిన ఎన్నికల్లో ఏకబిగిన రాష్ట్ర వ్యాప్తంగా దుమ్ము దులిపిన వైసీపీ.. ఇప్పుడు మాత్రం…
బంగ్లాదేశ్ లెజెండరీ క్రికెటర్లలో ఒకడైన తమీమ్ ఇక్బాల్ నిన్న ఓ క్రికెట్ మ్యాచ్ ఆడుతూ మైదానంలో కుప్పకూలడం.. ఆ తర్వాత…
తమిళ ఫిలిం ఇండస్ట్రీలో ఈ రోజు ఓ విషాదం విషాదం చోటు చేసుకుంది. పలు చిత్రాల్లో నటించిన షిహాన్ హుస్సేని…
మొన్న ‘రాబిన్ హుడ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన…
సోషల్ మీడియాలో కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత వ్యవహారం సైతం పెద్ద చర్చనీయాంశంగా మారుతుంటుంది. ఇప్పుడు ఓ భార్యాభర్తల…
రాత్రికి రాత్రి ఫోన్లు మోగాయి.. ఉదయానికల్లా.. చిలకలూరిపేటలోని టీడీపీ కార్యాలయం సండదిగా మారి పోయింది. పల్నాడు జిల్లాలోని పలు మండలాలకు…