Movie News

RC 16 నిర్ణయం వెనుక అసలు కహాని

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది మార్చి 26 విడుదలవుతుందనే లీక్ అభిమానుల్లో చర్చకు దారి తీసింది. ఈ సంవత్సరమే వస్తుందని భావిస్తే ఇంత ఆలస్యమవుతుందా అంటూ ఫీలవుతున్నారు. అయితే చిరంజీవి విశ్వంభర, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు, వరుణ్ తేజ్ – మేర్లపాక గాంధీ చిత్రం ఇలా వరసగా మెగా కాంపౌండ్ సినిమాలు రాబోయే ఆరేడు నెలల్లో వస్తున్నాయి కాబట్టి ఆర్సి 16 వాయిదా గురించి మెగా ఫ్యాన్స్ కి మరీ దిగులు అక్కర్లేదు. ఇదంతా పక్కన పెడితే పోస్ట్ పోన్ అసలు కహాని వేరే వినిపిస్తోంది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఆర్సి 16 ముందు ఈ ఏడాదే రిలీజ్ చేద్దామనుకున్నారు. ఓటిటి డీల్ కోసం సోని లివ్ చాలా పెద్ద మొత్తం ఆఫర్ చేసిందట. ఈ సంస్థ అంతర్జాతీయంగా పెద్దదే అయినా డిజిటల్ మార్కెట్ లో వెనుకబడే ఉంది. దాన్ని బలపరుచుకునే క్రమంలో ఆర్సి 16 ని మొదటి అడుగుగా వేద్దామనుకుని ప్లాన్ చేసింది. అయితే రామ్ చరణ్ వ్యక్తిగతంగా నెట్ ఫ్లిక్స్ అయితే తన సినిమాకు గ్లోబల్ రీచ్ వస్తుందని భావించి ముందు వాళ్ళను కనుక్కోమని నిర్మాతలను అడిగాడట. కానీ 2025 క్యాలెండర్ లో నెట్ ఫ్లిక్స్ కొత్త సినిమాలకు చోటు లేదు. 2026 అయితే డీల్ చేసుకుందామని సోని కన్నా కొంచెం తక్కువే ఆఫర్ చేసిందట.

అయినా పర్వాలేదని చరణ్ ప్రోద్బలంతోనే థియేటర్ రిలీజ్ ని వచ్చే ఏడాది మార్చికి మార్చారని తెలిసింది. గత రెండేళ్లుగా నెట్ ఫ్లిక్స్ జోరు మాములుగా లేదు. నాన్ స్టాప్ గా తెలుగు తమిళ సినిమాలు కొనుక్కుంటూ దూకుడు చూపిస్తోంది. ఆర్ఆర్ఆర్ రీచ్ దేశదేశాలు తిరిగిందంటే దానికి ప్రధాన కారణం ఈ ఓటిటినే. డాకు మహారాజ్, లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం, పుష్ప 2 లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న నెట్ ఫ్లిక్స్ కే ఆర్సి 16 ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఇదంతా అఫీషియల్ గా బయటికొచ్చింది కాదు కానీ అంతర్గత సమాచారమైతే ఇలా ఉంది. చరణ్ పుట్టినరోజు రాబోయే గురువారమే కాబట్టి క్లారిటీ రావొచ్చు.

This post was last modified on March 22, 2025 11:21 am

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

3 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

3 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

3 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

5 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

6 hours ago