Movie News

దగ్గుబాటి రానా ఇండో అమెరికన్ సినిమా

హీరోగా విలన్ గా తెరమీద కనిపించడం బాగా తగ్గించేసిన దగ్గుబాటి రానా తండ్రి సురేష్ బాబు బాటలోనే ప్రొడక్షన్ ని సీరియస్ గా తీసుకున్నాడు. కంటెంట్ ని నమ్ముకుని కమర్షియల్ ఫార్ములాకు దూరంగా తెలుగు సినిమాని కొత్త ట్రెండ్ వైపు నడిపించే ప్రయత్నాలు బలంగా చేస్తున్నాడు. స్టార్ క్యాస్టింగ్ ని పెట్టుకునే స్థాయి ఉన్నప్పటికీ క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యమని నమ్మి కేరాఫ్ కంచరపాలెం నుంచి 35 చిన్న కథ కాదు దాకా తను చేసిన ప్రయోగాలు హిట్లతో పాటు అవార్డులనూ తీసుకొచ్చాయి. తాజాగా ఇంకో అడుగు ముందుకేసి ప్యాన్ ఇండియాని మించి గ్లోబల్ స్టేజి వైపు పరుగులు పెడుతున్నాడు.

ఇండో అమెరికన్ దర్శకుడు బెన్ రేఖీతో రానా ఒక ప్రాజెక్టు లాక్ చేసుకున్నట్టు సమాచారం. మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. బెన్ రేఖీ ట్రాక్ రికార్డు మామూలుది కాదు. న్యూ యార్క్ యునివర్సిటి టిస్చ్ స్కూల్ అఫ్ ఆర్ట్స్ నుంచి పట్టభద్రుడైన ఇతను సుప్రసిద్ధ వార్నర్ బ్రోస్ నుంచి గ్రాంట్ అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడిగా తక్కువ వయసులోనే పేరు తెచ్చుకున్నాడు. 2004 బాంబ్ ది సిస్టమ్ తో నిర్మాణంలో అడుగు పెట్టి 2005 వాటర్ బోర్న్ తో మెగా ఫోన్ చేపట్టాడు. 2016 మన దేశంలోనే షూట్ చేసిన ది ఆశ్రమ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2019 వాచ్ లిస్ట్ సైతం క్లాసిక్ గా నిలిచింది.

ఈ లెక్కన రానా ఎంచుకున్నది ఆషామాషీ వ్యక్తిని కాదనే విషయం అర్థమైపోయిందిగా. జానర్ తదితర వివరాలు ఇంకా తెలియదు కానీ బడ్జెట్ మాత్రం భారీగా ఉండబోతోంది. ఖర్చు విషయంలో చాలా ప్లాన్డ్ గా ఉండే రానా ఇప్పుడీ ఇండో ఇంగ్లీష్ మూవీకి ఎంత పెట్టబోతున్నాడో చూడాలి. యాక్టింగ్ కన్నా ప్రొడక్షన్ ని ఎక్కువ సీరియస్ గా తీసుకుంటున్న రానా ఆ మధ్య తేజతో రాక్షస రాజు అనే సినిమా ప్రకటించాడు కానీ అది సెట్స్ కి వెళ్లిందో లేదో తెలియకుండానే ఆగిపోయింది. చిన్నికృష్ణ ఇచ్చిన కథతో ఒక సినిమా చేయొచ్చనే టాక్ వచ్చినా అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. టైం పట్టేలా ఉంది.

This post was last modified on March 22, 2025 10:25 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago