టాలీవుడ్లో ఒక సెన్సేషనల్ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు ఒక హాట్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో.. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ జట్టు కట్టబోతున్నాడన్నదే ఈ హాట్ న్యూస్. బాలయ్య-హరీష్ కాంబినేషన్లో సినిమాను అస్సలు ఊహించలేం. హరీష్ ఎక్కువగా యంగ్ హీరోలతోనే సినిమాలు చేశారు. బాలయ్య తరం సీనియర్లతో పని చేయలేదు. ఆయన ఎక్కువగా సినిమాలు చేసింది కూడా మెగా హీరోలతోనే. నందమూరి హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్‌తో ‘రామయ్యా వస్తావయ్యా’ చేశాడు. కానీ అది డిజాస్టర్ అయింది.
హరీష్ సినిమాల శైలికి, బాలయ్య చిత్రాల స్టైల్‌కు తేడా ఉంటుంది. ఐతే గత కొన్నేళ్లలో బాలయ్య గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ లాంటి హరీష్ సహచర యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేసి మంచి విజయాలందుకున్నారు. ఆయనకు వీళ్లు ఇమేజ్ మేకోవర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే హరీష్ శంకర్ సైతం బాలయ్యతో సినిమాకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌తో చాలా ఏళ్ల కిందట హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలైన సినిమాకు ఎప్పటికప్పడు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఒక కథ అనుకున్నాక దాన్ని మార్చి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పేరుతో మరో సినిమా మొదలుపెట్టారు. అది కూడా ముందుకు కదల్లేదు.
అది హోల్డ్‌లో పడిపోవడంతో ‘మిస్టర్ బచ్చన్’ చేశాడు హరీష్. కానీ అది డిజాస్టర్ అయింది. ‘ఉస్తాద్..’ ఇప్పుడిప్పుడే మొదలయ్యే సంకేతాలు కనిపించకపోవడంతో ఈలోపు మరో సినిమా చేయాలని హరీష్ డిసైడయ్యారు. రామ్‌తో సినిమా అన్నారు కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఈలోపు వేరే భాషల్లో పెద్ద సినిమాలు తీస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్త.. బాలయ్య-హరీష్ కలయికలో పెద్ద బడ్జెట్లో సినిమా చేయడానికి ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన రావచ్చంటున్నారు. ‘అఖండ-2’ పూర్తి చేశాక ఈ సినిమా పట్టాలెక్కొచ్చు.
This post was last modified on March 21, 2025 6:24 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…