Movie News

మంచి సినిమాకు టైమింగ్ మిస్సయ్యింది

ఇవాళ ఎవడే సుబ్రహ్మణ్యంని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్నీమధ్యే ఈవెంట్ చేసి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నాని, విజయ్ దేవరకొండ రీ యూనియన్ తో పాటు వేడుక తాలూకు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తిరిగాయి. అసలే నాని మంచి ఊపులో ఉన్న టైం. హీరోగా నిర్మాతగా వరస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇంకోవైపు విజయ్ దేవరకొండని లైగర్, ఫ్యామిలీ స్టార్ తర్వాత మళ్ళీ తెరమీద చూడలేదు. కింగ్ డమ్ కు ఇంకా టైం ఉంది కాబట్టి ఫ్యాన్స్ కి ఇది మంచి జ్ఞాపకంగా ఉంటుందని అందరూ అనుకున్నారు.

కట్ చేస్తే ఎవడే సుబ్రహ్మణ్యంకు ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. హైదరాబాద్ భ్రమరాంబ, వైజాగ్ లాంటి కొన్ని మెయిన్ సెంటర్లలో తప్ప మిగిలిన చోట టికెట్లు అంతంతమాత్రంగానే తెగాయి. కారణం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ దూకుడు. ఇంకోవైపు తొమ్మిదికి పైగా కొత్త రిలీజులు. అసలే ఎవడే సుబ్రహ్మణ్యం ఎమోషనల్ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్, విజిల్స్ వేయించే మాస్ ఎపిసోడ్స్ ఉండవు. ఫీల్ గుడ్ మూమెంట్స్ తో పాటు భావోద్వేగాలకు గురి చేసే సీన్లు, మంచి పాటలు ఉంటాయి. కానీ థియేటర్లలో అల్లరి చేస్తూ సందడి చేయాలనుకునే ఫ్యాన్స్ కోరుకునే స్టఫ్ ఉండదు.

ఒకవేళ మరో సందర్భంలో వచ్చి ఉంటే ఎవడే సుబ్రహ్మణ్యంకు మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి స్పందన దక్కేదేమో. అందుకే టైమింగ్ ముఖ్యమని చెప్పేది. నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆ మధ్య సోషల్ మీడియాలో అర్థం లేని కారణాలతో ఫ్యాన్ వార్లు చేసుకున్న సంగతి తెలిసిందే. వాళ్ళను కలిపేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందనుకుంటే ఇలా జరగడం ఊహించనిది. కల్కి 2898 ఏడి దర్శకుడు నాగ్ అశ్విన్ డెబ్యూగానూ దీనికి ప్రత్యేకత ఉంది. అన్నట్టు పదేళ్ల క్రితం ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ రోజే నాని మరో సినిమా జెండాపై కపిరాజు విడుదలయ్యింది. కాకపోతే అది డిజాస్టరయ్యింది.

This post was last modified on March 21, 2025 5:35 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago