అతడు.. తెలుగు ప్రేక్షకులు అత్యంత మెచ్చిన చిత్రాల్లో ఇది ముందు వరసలోఉంటుందనడంలో సందేహం లేదు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ చిత్రం 2005లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్ని అందుకుంది. కానీ ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక తెచ్చుకున్న స్పందన అనూహ్యం. వయో భేదం లేకుండా అందరూ ఈ సినిమాను తెగ ఇష్టపడి చూశారు.
మా టీవీ వాళ్లు ఎన్ని సార్లు ఈ సినిమాను టెలికాస్ట్ చేశారో లెక్కే లేదు. మొదట్లో నెలకోసారి వేసేవాళ్లు. తర్వాత ప్రతి వారం సినిమా ప్రదర్శితం అయ్యేది. రాను రాను రెండు మూడు రోజులకోసారి ఈ సినిమాను వెయ్యడమూ మొదలైంది. అయినా సరే.. అతడు వస్తుంటే అలా టీవీ పెట్టి ఎంజాయ్ చేస్తూ పనులు చేసుకోవడం అలవాటైపోయింది జనాలకు. డైలాగులన్నీ కంఠతా వచ్చేసినా సరే.. మళ్లీ మళ్లీ ఆ సినిమా చూడడం తెలుగువారికి ఒక అలవాటుగా మారిపోయింది.
ఇలా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయిన ‘అతడు’ ఇప్పుడు ఓ సంచలన రికార్డును అందుకుంది. ప్రపంచ సినీ చరిత్రలోనే టీవీలో ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ అయిన సినిమాగా ‘అతడు’ రికార్డ్ సృష్టించిందట. దానికి దరిదాపుల్లో కూడా ఏ సినిమా లేదట. బహుశా ఇప్పటిదాకా మరే చిత్రం కూడా వెయ్యిసార్లు కూడా టెలికాస్ట్ అయి ఉండకపోవచ్చు. కాబట్టి ‘అతడు’ రికార్డును భవిష్యత్తులో కూడా మరే చిత్రం అందుకునే అవకాశమే లేదు. ఇది ఒక శాశ్వత రికార్డుగా నిలిచిపోనుంది. ఒక సినిమా 1500 సార్లు ప్రదర్శితం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ రికార్డు గురించి చర్చించుకుంటున్నారు. మహేష్ బాబు అభిమానులైతే ఇది సూపర్ స్టార్‌కే సాధ్యం అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.
This post was last modified on March 19, 2025 10:35 pm
జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయోగాలు.. జనసేన నాయకులకు ఇబ్బందిగా మారుతున్నాయి. సాధారణంగా పార్టీని…
ఏపీ సీఎం చంద్రబాబుకు మరో కీలకమైన వ్యవహారం కత్తిమీద సాముగా మారనుంది. ఇప్పటి వరకు పాలన వేరు.. ఆమోదించిన బిల్లులు..…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరికి అత్యంత సమీపంలో ఓ ప్రైవేట్ హోటల్ వెలిసేందుకు అనుమతులు జారీ…
ఎనర్జిటిక్ స్టార్ రామ్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబం మొత్తాన్ని తీసుకుని శుక్రవారం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని…
గ్రోక్.. గ్రోక్.. గ్రోక్.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీని గురించే చర్చ. ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్…