టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్ గా దీని కొనసాగింపు కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మళ్ళీ చెప్పనక్కర్లేదు. నిర్మాత అశ్వినిదత్ ఆ మధ్య ఓ సందర్భంలో వేసవిలో మొదలు పెడతామని చెప్పారు కానీ అలాంటి సూచనలు దగ్గర్లో లేకపోవడంతో ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ నెలకొంది. ది రాజా సాబ్ ఇంకా నాలుగు పాటల బ్యాలన్స్ తో పాటు టాకీ పార్ట్, ఇంకోపక్క ఫౌజీ షూట్, ఆ తర్వాత స్పిరిట్ కు జరుగుతున్న సన్నాహాలు ఇవన్నీ చూసి ఎవరికైనా సందేహం రావడం సహజమే. ఇవాళ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియా ముందుకొచ్చారు.
పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవడే సుబ్రమణ్యం రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందులో నాగ్ అశ్విన్ కి కల్కి 2కి సంబంధించిన ప్రశ్నలు గట్టిగానే ఎదురయ్యాయి. తన దగ్గరే స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఏం చెప్పాలనే సందిగ్దత ఈ క్రియేటివ్ డైరెక్టర్ లో కనిపించింది. ప్రిపరేషన్లు జరుగుతున్నాయని, ఏడాది చివర్లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని చూచాయగా చెప్పారు. భైరవ కల్కి పాత్రల మీద ఎక్కువ దృష్టి పెట్టేలా కీలక మార్పులు జరుగుతున్నాయని కూడా అన్నారు. అయితే ప్రభాస్ ఎప్పుడు డేట్లు ఇస్తాడు, రిలీజ్ ఎప్పుడనుకున్నారనే క్వశ్చన్స్ కు మాత్రం సమాధానం దొరకలేదు.
ఎలా చూసుకున్నా కల్కి 2 రావడానికి ఇంకో రెండు మూడు సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రభాస్ కమిట్ మెంట్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా సలార్ 2 కూడా ఉండొచ్చనే వార్తల నేపథ్యంలో రాజా సాబ్, ఫౌజీ తర్వాత ఏది ముందు, ఏది తర్వాతనే క్లారిటీ రావడం లేదు. కల్కి 2 ఈసారి రెట్టింపు బడ్జెట్ తో తెరకెక్కబోతోందనేది వాస్తవం. అయితే విజయ్ దేవరకొండకు ప్రాధాన్యం పెరుగుతుందా లేక ప్రభాస్ ని ఈసారి ఎక్కువగా చూపిస్తారా లాంటివన్నీ ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉండబోతున్నాయి. మొత్తానికి ఎవడే సుబ్రహ్మణ్యం కాస్తా ఎక్కడ కల్కి 2 ప్రెస్ మీట్ లా మారింది.
This post was last modified on March 19, 2025 10:01 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…