Movie News

తారక్ ఫ్యాన్స్.. డౌట్లేమీ అక్కర్లేదు

గత ఏడాది దసరాకు ‘దేవర’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు జూనియర్ ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చేసిన ఈ సినిమా కోసం మూడేళ్లకు పైగానే సమయం పెట్టాడు తారక్. కానీ ఇకపై తారక్ చిత్రాల కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన పని లేదు. ‘దేవర’ వచ్చిన ఏడాది లోపే తన కొత్త సినిమా ‘వార్-2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా హృతిక్ రోషన్ గాయపడడంతో షెడ్యూళ్లు అన్నీ డిస్టర్బ్ అయ్యాయని.. ముందు అనుకున్నట్లుగా ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ఈ చిత్రం విడుదల కాదని మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. దీంతో హృతిక్, తారక్ ఫ్యాన్స్ నిరాశ చెందారు.

కానీ ఆ నిరాశను పోగొడుతూ చిత్ర నిర్మాణ సంస్థ ‘యశ్ రాజ్ ఫిలిమ్స్’ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన చేసింది. ‘వార్-2’ ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్నట్లు యశ్ రాజ్ ఫిలిమ్స్ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా స్పష్టం చేసింది. అంటే మొన్నటి షూటింగ్ బ్రేక్ చిన్నదే అనుకోవాలి. షెడ్యూళ్లు కూడా పెద్ద ఏమీ డిస్టర్బ్ కానట్లే. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 80 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. ఇంకో రెండు నెలల్లో షూట్ అంతా అయిపోతుంది.

జూన్ నుంచి ప్రి ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్లు సమాంతరంగా మొదలవుతాయి. హృతిక్-టైగర్ ష్రాఫ్ కాంబినేషన్లో సిద్దార్థ్ ఆనంద్ ‘వార్’ చిత్రాన్ని రూపొందించగా.. ‘వార్-2’లో మరో హీరోగా ఎన్టీఆర్ వచ్చాడు. దర్శకత్వ బాధ్యతలు ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ తీసుకున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ వారి స్పై యూనివర్శ్‌లో భాగంగానే ఈ చిత్రం కూడా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

This post was last modified on March 17, 2025 4:30 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఏప్రిల్ 25 – విష్ణు VS మనోజ్ ?

వ్యక్తిగత జీవితంలో నువ్వా నేనా అంటూ వివాదాలు, గొడవల్లో ఉంటున్న మంచు సోదరులు విష్ణు, మనోజ్ బాక్సాఫీస్ వద్ద కూడా…

34 minutes ago

కూలీ వేగం….నేర్చుకోవాల్సిన పాఠం

రజనీకాంత్ లాంటి పెద్ద సూపర్ స్టార్. టాలీవుడ్ సీనియర్ మోస్ట్ అగ్ర హీరో నాగార్జున ప్రత్యేక పాత్ర. కన్నడలోనే బిజీగా…

1 hour ago

రాజా సాబ్ కోసం తమన్ కొత్త ప్రయోగం

మాములుగా ఏదైనా పెద్ద సినిమాకు పాటల రికార్డింగ్ జరిగిపోయాక వాటిని ఎప్పుడు షూట్ చేస్తారు, ఎంత టైంలో విడుదలవుతుందనేది మ్యూజిక్…

2 hours ago

అసలు నాగ్‌పూర్‌లో ఏం జరుగుతోంది?

ఇటీవల విడుదలైన ఛావా సినిమాలో శంబాజి మహరాజ్ సీన్స్ చాలామందిని కదిలించాయి. ముఖ్యంగా ఔరంగజేబు క్యారెక్టర్ శంబాజిని అతి క్రూరంగా…

3 hours ago

పాక్ క్రికెట్.. ఒక్క దెబ్బతో ఆవిరైన 869 కోట్లు

పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. భారత్…

8 hours ago

ఖలిస్తానీ గ్రూప్‌పై రాజ్‌నాథ్ గురి.. అమెరికా ఎలా స్పందిస్తుందో?

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) పై కఠిన చర్యలు…

10 hours ago