ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప 2 ది రూల్ తర్వాత మూడో భాగం ది ర్యాంపేజ్ ఉంటుందని చివర్లో హింట్ ఇచ్చారు కానీ నిజంగా వస్తుందా రాదానే అనుమానాలు ఫ్యాన్స్ లో లేకపోలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ అల్లు అర్జున్ కనక మరోసారి ఎక్కువ టైం త్యాగం చేయగలిగితే నేను రెడీ అనే సంకేతం ఇస్తే, అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా బన్నీ మాట్లాడుతూ ఇక చాలు అనేలా సంజ్ఞ చేశాడు. తాజాగా రాబిన్ హుడ్ ప్రమోషన్లలో నిర్మాత రవి శంకర్ పుష్ప 3 మూడేళ్ళ తర్వాత అంటే 2028లో రిలీజవుతుందని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
సరే కొంచెం ప్రాక్టికల్ గా చూద్దాం. అల్లు అర్జున్ ఇంకా అట్లీ ప్యాన్ ఇండియా మూవీ మొదలుపెట్టలేదు. వేసవిలో స్టార్ట్ చేసినా కనీస పక్షం ఏడాదికి పైగానే ప్రొడక్షన్ పడుతుంది. వచ్చే సంవత్సరం రిలీజ్ అనుకుందాం. వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కించాలి. అదో ఫాంటసీ మూవీ, అందులోనూ పెద్ద బడ్జెట్, వేగంగా చేయడం జరగని పని. కనిష్టంగా 2027 దాటిపోతుంది. మరి పుష్ప 3 మొదలుపెట్టాలంటే దానికోసమే ప్రత్యేకంగా హెయిర్ స్టైల్, గెడ్డం పెంచుకోవాలి. విగ్గులు బాగుండవు. బన్నీ వాటి జోలికి కూడా వెళ్లడు. అంటే మూడో భాగం ముందే తీసి ఉంచారా అనే సందేహం వస్తుంది.
కానీ అలాంటిదేమి లేదని ఇన్ సైడ్ టాక్. పుష్ప 3 నిజంగా అనుకుంటే కనక షూటింగ్ చేయాల్సిందే. అలా ఫిక్స్ అయితే ఆర్సి 17 చేసుకొచ్చి పుష్ప 3ని సుకుమార్ ఏడాదిలోపు ఫినిష్ చేయడం అసాధ్యం. ఇవన్నీ విశ్లేషించుకుంటే 2028 రిలీజ్ సాధ్యమేనా అనే డౌట్ ఎవరికైనా సహజం. రవిశంకర్ యథాలాపంగా అని ఉండొచ్చు. అంతే తప్ప ఖచ్చితంగా ఆ డెడ్ లైన్ కి రిలీజ్ చేసి తీరతామని అనలేరు. ఎందుకంటే పుష్ప 1, పుష్ప 2లు సైతం చాలా వాయిదాలకు లోనయ్యాయి. ఇప్పుడు అట్లీ, త్రివిక్రమ్ సినిమాలు వరసలో పెట్టుకుని పుష్ప 3 వేగంగా చేయడం అంత సులభం కాదు. ఇంకా క్లారిటీ రావాలంటే బన్నీ ఓపెన్ అవ్వాల్సిందే. దానికైనా టైం పడుతుంది.
This post was last modified on March 17, 2025 8:46 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…