సినిమాల వరకు స్టార్ డంని నిర్ణయించేది మాస్ ప్రేక్షకులే. అందులో సందేహం లేదు. దివంగత ఎన్టీఆర్ నుంచి ఇప్పటి మహేష్ బాబు దాకా అందరికీ ఇదే వర్తిస్తుంది. కేవలం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ తో మార్కెట్ బలపడదు. అందుకే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇదే ఫాలో కావాలని చూస్తుంటారు. కానీ ఇమేజ్ ఇంకా స్థిరపడని మీడియం రేంజ్ హీరోలు దీని జోలికి వెళ్లడం రిస్క్ గా మారిపోతోంది. తాజాగా దిల్ రుబా చూశాక అందరికి వచ్చిన అనుమానం ఇదే. కిరణ్ అబ్బవరం ఎందుకింత ఓవర్ మాస్ ఎలివేషన్లు ఒప్పుకున్నాడని. అది కూడా ఇద్దరమ్మాయిలతో ముడిపడిన లవ్ స్టోరీలో.
గతంలోనూ కిరణ్ ఈ తప్పు చేశాడు. మీటర్, నేను మీకు బాగా కావాల్సినవాడినిలో అవసరం లేని మాస్ హీరోయిజం ఎక్కువగా ఉంటుంది. అవే ఫలితాన్ని ప్రతికూలంగా మార్చాయి. మొన్న లైలాతో తెలుగు రాష్ట్రాలను నవ్వులతో ముంచేద్దామని చూసిన విశ్వక్ సేన్ చివరికి ట్రోలింగ్ కు టార్గెట్ అయ్యాడు. సోషల్ మీడియాలో క్షమాపణ చెప్పే దాకా పరిస్థితి వెళ్లిందంటే కంటెంట్ మీద ఎంత నెగటివిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అంతకు ముందు గ్యాంగ్స్ అఫ్ గోదావరి, దాస్ కా ధమ్కీలు సైతం మాస్ ని పూర్తిగా మెప్పించలేకపోయాయి. హోమ్లీగా ఉన్న అశోకవనంలో అర్జున కళ్యాణమే మంచి పేరు తీసుకొచ్చింది.
సో కథలు వినేటప్పుడు దర్శకులు ఇచ్చే బిల్డప్పులును అతిగా ఊహించుకోకుండా ప్రాక్టికల్ గా ఆలోచిస్తేనే సక్సెస్ లు దక్కుతాయి. థ్రిల్లర్ జానర్ లో ఎక్స్ పరిమెంట్ చేయబట్టే కిరణ్ కు క రూపంలో బ్లాక్ బస్టర్ దక్కింది. అంతే తప్ప తన ఇమేజ్ మీద ఆడిన సినిమా కాదది. గామి విషయంలో విశ్వక్ ఇది గుర్తించినా దాన్ని సీరియస్ గా ఆలోచించలేదు. ఓవర్ మాస్ అందరికీ సూటవ్వదు. దేవర లాంటి కథలో జివి ప్రకాష్ కింగ్స్టన్ చేస్తే ఏమయ్యింది. నిలువునా మునిగిపోయింది. మోసేవాడి స్థాయిని బట్టి బరువు పెట్టాలి కానీ ఎంత బరువు పెట్టిన మోస్తాం అనుకుంటే ఇలాంటి ఎదురుదెబ్బలు మీడియం హీరోలకు తగులుతూనే ఉంటాయి.
This post was last modified on March 16, 2025 3:59 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…