రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉంటుందనే టాక్ ఉంది కానీ ఏ క్రీడకు సంబంధించిందనే క్లారిటీ అభిమానుల్లో లేదు. షూటింగ్ కు సంబంధించిన లీక్స్ లో ఒక్కో ఆటకు సంబంధించిన సమాచారం రావడం అయోమయాన్ని పెంచింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇందులో హీరో పాత్ర ఆల్ రౌండర్. అంటే సందర్భాన్ని, అవసరాన్ని బట్టి పవర్ క్రికెట్, కుస్తీ, కబడ్డీ, మల్లయుద్ధం ఇలా అన్నీ చేస్తాడన్న మాట. దానికి తగ్గట్టే ధీటైన శరీరం, గుబురు గెడ్డంతో పల్లెటూరి హీమ్యాన్ లా ఓ రేంజ్ లో క్యారెక్టర్ డిజైన్ చేశారట.
మరి ఎందుకు ఇన్నేసి ఆటలు ఆడతాడు, వాటితో డ్రామా ఎలా పండిస్తాడనేది మాత్రం సినిమాలోనే చూడాల్సి ఉంటుంది. ఎంత గ్రామీణ నేపధ్యమైనా యాక్షన్, ఎలివేషన్ రెండు సరిపడా మోతాదులో ఉండేలా చూసుకుంటున్న బుచ్చిబాబు చాలా వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పట్టినా పర్వాలేదు కానీ చిత్రీకరణ మాత్రం లేట్ అవ్వకుండా షెడ్యూల్స్ వేసుకుంటున్నాడు. శివరాజ్ కుమార్ కు సంబంధించిన ఎపిసోడ్స్ చకచకా జరిగిపోతున్నాయి. జాన్వీ కపూర్ ఇటీవలే వచ్చేసింది. అందరి ఆర్టిస్టుల కాంబోలో సన్నివేశాలు పూర్తయిపోతున్నాయి.
విడుదల ఈ సంవత్సరం ఉంటుందా లేదానేది ఇంకా తెలియాల్సి ఉంది. టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫ్యాన్స్ మాత్రం గేమ్ చేంజర్ అవమానం జరిగిన ఏడాదిలోనే బ్లాక్ బస్టర్ కొట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఇంకో రెండు పాటలు ఇవ్వాలట. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ఎక్కువ టైం అడిగే ఛాన్స్ ఉంది. తాజాగా ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన రెహమాన్ పూర్తిగా కోలుకున్నాక మిగిలిన వర్క్ ఉంటుంది. మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టినరోజుకి ఫ్యాన్స్ ఆర్సి 16 టీజర్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కానీ సాధ్యమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కొత్త పోస్టర్ వస్తుంది కానీ రిలీజ్ డేట్ ఉండకపోవచ్చు.
This post was last modified on March 16, 2025 12:37 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…