మొన్న శుక్రవారం కోర్ట్ హడావిడిలో పడి వేరే కొత్త సినిమాలు పట్టించుకోలేదు కానీ వాటిలో మలయాళం డబ్బింగ్ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ ఉంది. ఓటిటి ప్రేక్షకులకు బాగా పరిచయమున్న కుంచకో బోబన్ హీరోగా ప్రియమణి ఆయన భార్యగా ప్రధాన పాత్ర పోషించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కేరళలో మంచి విజయం నమోదు చేసుకుంది. నిజానికి తెలుగు వెర్షన్ మార్చి 7 రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు. కానీ పోటీ ఎక్కువగా ఉండటం, థియేటర్ల కొరత కారణంగా వాయిదా వేశారు. ప్రమోషన్లు అంతంతమాత్రంగా జరిగాయి. సోషల్ మీడియాలో దీని గురించి తెలిసిన కాసిన్ని జనం వెళ్లారు తప్పించి ఎక్కువ సెంటర్లలో షోలే వేయలేదు.
సరే టాక్ మెల్లగా వస్తే ఆడియన్స్ పెరుగుతారనుకుంటే వచ్చే వారం మార్చి 20 తెలుగుతో సహా మల్టీ లాంగ్వేజెస్ లో ఆఫీసర్ ఆన్ డ్యూటీ స్ట్రీమింగ్ చేస్తామని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మాత్రం సంబరానికి అనువాదం చేయడం ఎందుకు. పోస్టర్ ఖర్చులు, డిజిటల్ వ్యయం, మార్కెటింగ్, బయ్యర్ల ఒప్పందాలు, థియేటర్ అద్దెలు ఇవన్నీ కనీసం సగమైనా వసూలు కావాలంటే ఓ వారం గ్యాప్ దొరకాలి. రిలీజైన రెండో రోజే ఓటిటి అనౌన్స్ మెంట్ వస్తే వెళ్లాలన్న ఆ గుప్పెడు జనాలు ఆగిపోతారు. గతంలో ఇదే తరహాలో టోవినో థామస్ – త్రిషల ఐడెంటిటీని ఊసులో లేకుండా చేసిన ఘనత ఇక్కడే జరిగింది.
ఇక కంటెంట్ విషయానికి వస్తే ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఒక క్రైమ్ థ్రిల్లర్. దొంగతనానికి గురైన బంగారు గొలుసు కేసులో ఓ అమ్మాయి చనిపోతే దానికి బెంగళూరులో పోలీస్ ఆత్మహత్యకు లింక్ ఉందని హీరో గుర్తిస్తాడు. ఈ క్రమంలో విచారణ చేసే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటికి వస్తాయి. అసలు హంతకుడు ఎవరు, రెండింటి మధ్య సంబంధం ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలో చూపించారు. మరీ ఎక్స్ ట్రాడినరి కాదు కానీ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకు ఓ మోస్తరుగా పర్వాలేదనిపించే మ్యాటర్ మూవీలో ఉంది. ఎలాగూ ప్రకటన వచ్చేసింది కాబట్టి టికెట్ కొనాలో లేక జస్ట్ వన్ వీక్ ఆగాలో ఆడియన్స్ ఇష్టం.
This post was last modified on March 15, 2025 5:53 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…