ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కన్నప్ప కోసం మంచు విష్ణు ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టాడు. ఇంటర్వ్యూలతో పాటు అవుట్ డోర్ పబ్లిసిటీ చేసుకుంటూ క్రమంగా బజ్ పెంచే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రభాస్ క్యామియో చేయడం వల్ల దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాన్ ఇండియా రిలీజ్, వంద కోట్ల దాకా బడ్జెట్, చాలా పెద్ద క్యాస్టింగ్ లాంటి అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ట్రోలింగ్ ని టార్గెట్ చేసుకున్న సోషల్ మీడియా బ్యాచులు లేకపోలేదు. కాకపోతే గతంలో తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు అంత ఓవరాక్షన్ చేయడం లేదు. ఇక అసలు పాయింటుకొద్దాం.
ఇటీవలే కన్నప్ప నుంచి ఒక లవ్ సాంగ్ రిలీజయ్యింది. విష్ణుతో పాటు హీరోయిన్ ప్రీతీ ముకుందన్ చేసిన గ్లామర్ షో మీద కామెంట్స్ వచ్చాయి. భక్తి చిత్రంలో ఇలా రొమాన్స్ చూపిస్తారా అంటూ ఒక వర్గం లాజిక్ బయటికి తీసింది. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా తీసినప్పుడు డాక్యుమెంటరీని ఎలా ఆశిస్తారని విష్ణు చెప్పడం లాజికల్ గా రైటే. ఎలా అంటే మూడు దశాబ్దాల క్రితం వచ్చిన అన్నమయ్యలో నాగార్జున – రమ్యకృష్ణ – కస్తూరి మధ్య ప్రేమకథతో పాటు మోహన్ బాబు, రోజాతో రొమాన్స్ చేయించారు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు. అవి కథతో పాటు ప్రయాణించి నెగటివ్ ఫీడ్ బ్యాక్ తేలేదు.
ఆ తర్వాత శ్రీరామదాసులోనూ దీన్నే ఫాలో అయిపోయి విజయం అందుకున్నారు. పాండురంగడులో మాత్రం కొంచెం మోతాదు మించడంతో ఫలితం రాలేదు. కానీ కన్నప్పలో అవసరం మేరకే ప్రేమని జొప్పించామని చెబుతున్న విష్ణు పూర్తి సినిమా చూశాక మీకే అర్థమవుతుందని వివరిస్తున్నాడు. అలనాటి భక్త కన్నప్పలోనూ కృష్ణంరాజు, వాణిశ్రీల మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది. కాకపోతే మోడరన్ కన్నప్పలో ఇప్పటి జనరేషన్ కు అనుగుణంగా డోస్ పెట్టారు. ఓటిటిలకు చూపించి అమ్మనని, రిలీజయ్యాక వాళ్లంతట వాళ్లే వస్తారని ధీమాగా ఉన్న విష్ణు నమ్మకం మీద ఏప్రిల్ 25న థియేటర్లలో తీర్పు రానుంది.
This post was last modified on March 15, 2025 4:11 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…