Movie News

ఖైదీ 2 ఎప్పుడు రావొచ్చంటే

సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో కార్తీ మార్కెట్ కి తిరిగి జీవం పోసింది కూడా ఈ బ్లాక్ బస్టరే. కేవలం ఒక రాత్రిలో జరిగే సంఘటనలు తీసుకుని పీక్స్ హీరోయిజం చూపించిన తీరుకి ఆడియన్స్ థ్రిల్ అయ్యారు. ఏకంగా విజయ్ లాంటి స్టార్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడంటే అది ఖైదీ ప్రభావమే. అందుకే ఆ క్లాసిక్ అంటే అభిమానులకు తగని మక్కువ. అయితే ఆ సినిమాలో చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. ముఖ్యంగా కార్తీ ఎందుకు జైలుకొచ్చాడనే పాయింట్. ఇవన్నీ సీక్వెల్ లో చూపిస్తానని లోకేష్ చెబుతూ వచ్చాడు.

రజనీకాంత్ కూలి తర్వాత ఖైదీ 2నే మొదలవుతుందని చెన్నై వర్గాలు గతంలో ఉటంకించాయి. తాజా అప్డేట్ ప్రకారం ఇప్పుడీ సీక్వెల్ 2026 ఏప్రిల్ కి వాయిదా వేశారట. అంటే దీనికన్నా ముందు మరో సినిమా తీస్తాడానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సూర్యతో రోలెక్స్ ఏమైనా పట్టాలు ఎక్కిస్తాడానే డౌట్ కూడా వస్తోంది. క్లారిటీ ఏంటంటే కూలి ఈ దసరా లేదా దీపావళికి రిలీజవుతుంది. ఆ తర్వాత లోకేష్ కొంచెం బ్రేక్ తీసుకుంటాడు. అంటే డిసెంబర్ దాకా అనుకుందాం. కొత్త స్క్రిప్ట్ మొదలుపెట్టినా దానికో ఆరు నెలలు పైనే కావాలి. అంటే అటు ఇటుగా ఏప్రిల్ వచ్చేస్తుంది.

సో ఖైదీ 2నే నెక్స్ట్ అనే క్లారిటీ వస్తున్నట్టేగా. రోలెక్స్ కి ఇంకా చాలా టైం పడుతుంది. ఎందుకంటే రెట్రో అయిపోయింది. 45వ సినిమా ఇంకా సగమే అయ్యింది. వెట్రిమారన్ వడివాసల్ కోసం సూర్య ఎక్కువ సమయం త్యాగం చేయాల్సి ఉంటుంది. వీటి మధ్యలో రోలెక్స్ అవ్వని పని. పోనీ విక్రమ్ 2 అనుకుంటే అటు కమల్ హాసన్ కూడా బిజీగా ఉన్నారు. సో ఖైదీ 2కి రూట్ క్లియర్ గా ఉందనేది ఓపెన్ సీక్రెట్. కాకపోతే ఖచ్చితంగా ఇదే మొదలవుతుందా లేక లోకేష్ మనసు మారుతుందా అనేది వేచి చూడాలి. విపరీతమైన అంచనాలు మోస్తున్న కూలి కనక బ్లాక్ బస్టర్ అయితే లోకేష్ పేరు దేశం దాటి మారుమ్రోగడం ఖాయం.

This post was last modified on March 14, 2025 7:43 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

4 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

5 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

5 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

5 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

6 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

6 hours ago