ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్.. 60వ ఏట అడుగు పెడుతున్న తరుణంలో కొత్త బంధంలోకి వెళ్లబోతున్న సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమిర్ కొత్త బంధం గురించి కొన్ని నెలలుగా రూమర్లు వినిపిస్తుండగా.. తాజాగా అతనే స్వయంగా దీని గురించి వెల్లడించాడు. గౌరీ స్ప్రాట్ అనే తన స్నేహితురాలితో ఏడాదిగా డేటింగ్ చేస్తున్నట్లు తన పుట్టిన రోజు సందర్భంగా చెప్పాడు ఆమిర్. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గౌరీ గురించి ఇలా సమాచారం ఇచ్చాడో లేదో.. మీడియా వాళ్లు ఆమె చరిత్ర అంతా బయటికి తీసే ప్రయత్నంలో పడిపోయారు.
రెండు రోజులు తిరిగేసరికే గౌరీ గురించి చాలా సమాచారం బయటికి వచ్చేసింది. ఇంతకీ మీడియా వాళ్లు గౌరీ గురించి ఏం తెలుసుకున్నారంటే..గౌరీ స్ప్రాట్ ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తోంది. ప్రముఖ స్టైలిస్ట్ రీటా స్ప్రాట్ తనయురాలే గౌరి. ఈ కుటుంబానికి బెంగళూరులో ఒక పెద్ద సెలూన్ ఉంది. బ్లూ మౌంటెన్ స్కూల్లో చదువుకున్న గౌరీ.. తర్వాత ఫ్యాషన్ కోర్సులు చేసింది. లండన్ యూనివర్శిటీలో ఎఫ్‌డీఏ స్టైలింగ్ అండ్ ఫొటోగ్రఫీలో శిక్షణ పొందింది. ముంబయిలోనూ గౌరీ ఒక సెలూన్ నడుపుతోంది. దాని పేరు.. బీబ్లంట్. బాలీవుడ్‌కు చెందిన అనేకమంది సెలబ్రెటీలు ఇక్కడికి వస్తుంటారు.
గౌరీతో పాతికేళ్లుగా ఆమిర్‌కు పరిచయం ఉంది. కొన్నేళ్లుగా ఆమిర్ ప్రొడక్షన్ హౌస్‌లో గౌరీ అసిస్టెంట్‌గా పని చేస్తోంది. ఏడాదిన్నరగా ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ఐతే ముంబయిలో మీడియా ఫోకస్ ఎక్కువగా ఉండడం వల్ల గౌరీ కోసం ఆమిరే ఎక్కువగా బెంగళూరుకు వెళ్లేవాడు. అక్కడే ఇద్దరూ కలిసి ఉంటూ వచ్చారు. గౌరీ పెద్దగా సినిమాలు చూడదట. ఆమిర్ ఆమె కోసం స్వయంగా పాటలు పాడి ఎంటర్టైన్ చేస్తుంటాడట. గౌరీకి ఇంతకుముందే పెళ్లయింది. కానీ ఆ బంధం నిలబడలేదు. విడాకులు తీసుకుంది. ఆమెకు ఆరేళ్ల కొడుకున్నాడు. ఆమిర్ తమ రిలేషన్ గురించి మీడియాకు చెప్పేముందే తన కోసం ప్రైవేటు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశాడట.
This post was last modified on March 14, 2025 7:38 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…