పుష్ప 2 ది రూల్ తర్వాత ఐకాన్ స్టార్ బన్నీ చేయబోయే కొత్త సినిమా గురించి పరిశ్రమ, మీడియా వర్గాల్లో ఎడతెగని ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాల్సిన ఫాంటసీ మూవీ ఆలస్యమయ్యేలా ఉండటంతో అట్లీతో ఒక ప్యాన్ ఇండియా పూర్తి చేయాలనుకున్నది నిజమే. దానికి అనుగుణంగా స్క్రిప్ట్ పనులు కొలిక్కి వచ్చాయి. అయితే ఆరు వందల కోట్లకు పైగా బడ్జెట్ డిమాండ్ చేస్తున్న ఈ ప్రాజెక్టు మీద అంత పెట్టుబడి వర్కౌట్ అవుతుందానే అనుమానంతో సన్ పిక్చర్స్ వెనక్కు తగ్గినట్టు వచ్చిన పుకారు అభిమానుల్లో కొత్త కన్ఫ్యూజన్ రేపింది. దాని స్థానంలో దిల్ రాజు ప్రవేశించారనేది ఇంకో ట్విస్ట్.
నిజానిజాలు కాసేపు పక్కనపెడితే అల్లు అర్జున్ మార్కెట్ మీద ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవన్నది వాస్తవం. అన్నీ పుష్ప లాగా అంతే రెవిన్యూ చేస్తాయన్న గ్యారెంటీ లేకపోవచ్చు. కానీ కనీసం అయిదారు వందల కోట్లను థియేటర్, నాన్ థియేటర్ హక్కుల రూపంలో వెనక్కు తేగలిగే స్టామినా బన్నీ సంపాదించుకున్నాడనేది నిజం. కాకపోతే ఏ దర్శకుడితో చేస్తున్నాడనేది మార్కెట్ లెక్కలను నిర్ణయిస్తుంది. జవాన్ బ్లాక్ బస్టరే, అందులో అనుమానం లేదు. అయితే ఆ సినిమా దర్శకుడిగా కలిగిన ప్రయోజనం కన్నా నిర్మాతగా వ్యవహరించిన బేబీ జాన్ వల్ల జరిగిన డ్యామేజే ఇప్పుడు అట్లీ రేంజుని తగ్గించిందనేది ముంబై కథనం.
ఇక దిల్ రాజు సంప్రదింపులు జరుపుతున్నది ఇప్పుడేదో అట్లీ ప్రాజెక్టుని టేకప్ చేయడం కోసం కాదనేది ఇన్ సైడ్ టాక్. భవిష్యత్తు కాంబో కోసం కలుస్తున్నారని ఒక వర్గం అంటోంది. పుష్పకు ముందు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాని అనౌన్స్ మెంట్ తర్వాత వద్దని చెప్పిన అల్లు అర్జున్ దాన్ని తీర్చుకోవడానికి వేరే కథతో మరో సినిమా చేస్తానని ఇంతకు ముందే హామీ ఇచ్చారట. సో దీనికి టైం పడుతుంది. ఒకవేళ సన్ కనక నిజంగా తప్పుకుంటే దిల్ రాజు, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా చేతులు కలిపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా తేలడానికి టైం పడుతుంది కాబట్టి ఫ్యాన్స్ కొంచెం ఓపిగ్గా ఎదురు చూడాల్సిందే.
This post was last modified on March 13, 2025 8:16 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…