సినిమా మీద నమ్మకంతో హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వడానికైనా వెనుకాడని ట్రెండ్ వచ్చేసింది. మొదటి రోజు ఖచ్చితంగా జనాన్ని థియేటర్లకు రప్పించాలనే ధృడ సంకల్పంతో ఎలాంటి హామీలకైనా సై అనే ధోరణి క్రమంగా పెరుగుతోంది. నిన్న జరిగిన దిల్ రుబా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత రవి మాట్లాడుతూ ఇందులో కిరణ్ అబ్బవరం చేసే ఫైట్లు మీకు నచ్చకపోతే మధ్యాన్నం నన్ను చితక్కొట్టేయమని పిలుపు ఇవ్వడమే కాక ఒకవేళ మీకు నచ్చని పక్షంలో ఇకపై ప్రొడ్యూసర్ గా ఉండటం మానేస్తానని చెప్పడం మరో సంచలనం. ఇదంతా సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది.
సరే కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదే. అవసరం కూడా. అలాని మరీ ఇంతగా ఆవేశపడాలా అనే కామెంట్స్ కి సమాధానం దొరకడం కష్టం. ఎందుకంటే చరిత్ర సృష్టించిన బ్లాక్ బస్టర్ల ఈవెంట్లలో సైతం ఇలాంటి పోకడ చూసి ఉండం. కానీ మీడియం బడ్జెట్ చిత్రాలకు ఓపెనింగ్స్ తెచ్చుకోవడం సవాల్ గా మారుతున్న తరుణంలో ఏదోలా ప్రేక్షకులను తమవైపు తిప్పుకునేలా చేసేందుకు ఆయా యూనిట్లు పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు. నాలుగేళ్ల క్రితం ఒక యూత్ హీరో సినిమా హిట్ కాకపోతే పేరు మార్చుకుంటానని శపథం చేశాడు. తీరా అది యావరేజ్ అయితే దాని గురించి మళ్ళీ ఎక్కడా నోరెత్తలేదు.
సో ఇప్పుడు దిల్ రుబా అంత ఎక్స్ ట్రాడినరి ఉందని ఆడియన్స్ కి అనిపిస్తేనే నిర్మాత మాటకు విలువ వస్తుంది. కెజిఎఫ్ రేంజ్ లో ఇంతగా ఫైట్ల గురించి హైలైట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే దిల్ రుబా ఒక ఆవేశం నిండిన యువకుడి బ్రేకప్ కం న్యూ లవ్ స్టోరీ. మరి యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ఇంత చెప్పారంటే మ్యాటర్ ఏదైనా వేరే ఉందేమో. కిరణ్ నమ్మకం కూడా ఇంతే స్థాయిలో ఉంది. సంగీత దర్శకుడు సామ్ సిఎస్ అక్కడ లేకపోయినా పబ్లిక్ గా ముద్దులు ఆఫర్ చేశాడు. ఫ్యాన్స్ గర్వపడేలా చేస్తానని హామీ ఇచ్చాడు. వీటన్నింటికి సమాధానం రేపు రాత్రి ప్రీమియర్లతోనే దొరికిపోనుంది.
This post was last modified on March 12, 2025 10:58 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…