అమ్మోరు తల్లి అనగానే నిన్నటితరం తెలుగు ప్రేక్షకులకు ఒక రకమైన భక్తి భావం ఒంట్లోకి వచ్చేస్తుంది. 90ల్లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. ఆ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ప్రభావితం చేసిందంటే.. అది ఆడుతున్న ప్రతి థియేటర్ ముందూ అమ్మోరుతల్లి ప్రతిమను పెట్టి పూజలు పునస్కారాలు చేశారు. థియేటర్లు సైతం దేవాలయాల్లా మారిపోయాయి. అప్పటి ప్రేక్షకుల్లో భయం, భక్తిని పెంచిన సినిమా ఇది. ఒక దేవుడి సినిమా ఈ స్థాయిలో ప్రభావితం చేయడం అరుదైన విషయం.
ఆ తర్వాత ‘అమ్మోరు’ను అనుకరిస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ.. ఆ సినిమా స్థాయిలో ఏదీ ఆడలేదు. ఒక దశ దాటాక ఆ టైపు సినిమాలు ఆగిపోయాయి. ప్రేక్షకుల అభిరుచి మారిపోవడమే అందుక్కారణం. ఐతే చాలా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ అమ్మోరు తల్లి తెరపైకి రావడం విశేషం.
తమిళంలో ‘మూకుత్తి అమ్మన్’ పేరుతో తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార అమ్మోరి పాత్ర పోషించిన చిత్రమిది. యాంకర్, నటుడు ఆర్జే బాలాజి ఇందులో కీలక పాత్ర పోషించడమే కాదు.. శరవణన్ అనే మరో దర్శకుడితో కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు. భయస్థుడైన రిపోర్టర్‌గా అతను ఇందులో పాత్ర చేశాడు.
కష్టాల్లో ఉన్న అతడి కుటుంబాన్ని ఆదుకోవడానికి వారి కుల దైవం అయిన అమ్మవారు భూమి మీదికి వస్తారు. అతడి కష్టాలు తీర్చాక భక్తి పేరుతో జనాల్ని తప్పుదోవ పట్టిస్తూ, వారిని దోచుకుంటూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న దొంగ స్వామీజీల భరతం పట్టడానికి సిద్ధమవుతారు. ఈ క్రమంలో ఏం జరిగిందన్నది మిగతా కథ. ఐతే దీని ట్రైలర్ చూస్తే సినిమా కామెడీ ప్రధానంగా నడుస్తుందని అర్థమవుతోంది. ‘అమ్మోరు’ తరహా సీరియస్‌నెస్ ఎక్కడా లేదు. ఆద్యంతం వినోదాత్మకంగా సినిమా నడిచేలా ఉంది. హాట్ స్టార్‌లో దీపావళి కానుకగా వచ్చే నెల 14న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
This post was last modified on October 27, 2020 2:44 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…