నేచురల్ స్టార్ నాని సూపర్ ఫామ్‌లో ఉన్న హీరో మాత్రమే కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాత కూడా. ‘అ!’ మొదలుకుని నాని నిర్మించిన ప్రతి చిత్రంలో తన అభిరుచి కనిపిస్తుంది. తనే హీరోగా నటిస్తున్న ‘హిట్-3’తో పాటు ‘కోర్ట్’ అనే చిన్న సినిమాను కూడా అతనే ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ఒకెత్తయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల రూపొందించబోయే సినిమాలో నాని నిర్మాణ భాగస్వామి కావడం మరో ఎత్తు. శ్రీకాంత్‌ను చిరు దగ్గరికి తీసుకెళ్లి ఈ ప్రాజెక్ట్ సెట్ చేసిందే నాని. అంతే కాక చిరు తనయురాలు సుష్మితతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. చిరుకు వీరాభిమాని అయిన నాని.. ఆయన సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడం గురించి ఇప్పటికే చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఈ సినిమాలో నటించడం కోసం చిరు సైతం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు.
కాగా చిరు అంతటి వాడు.. నానిని ప్రొడ్యూసర్ గారూ అని సంబోధించడం అంటే విశేషమే కదా. ఇటీవలే అదే జరిగిందట. అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ళ పెళ్లిలో ఈ విశేషం చోటు చేసుకుందట. వేదిక మీద నవ దంపతులకు శుభాకాంక్షలు చెప్పి తిరిగి వస్తుండగా.. చిరంజీవి ఎదురు పడ్డాడని, అప్పుడాయన ‘‘ప్రొడ్యూసర్ గారూ బాగున్నారా’’ అని అడిగాడని నాని గుర్తు చేసుకున్నాడు. చిరుతో తనతో మాట్లాడుతున్నాడని తాను అనుకోలేదని.. అశ్వినీదత్ లాంటి పెద్ద వాళ్లెవరైనా తన వెనుక ఉన్నారేమో అనుకుని వెనుదిరిగి చూశానని.. కానీ అక్కడ ఎవరూ లేరని నాని తెలిపాడు.
చిరు వెంటనే.. ‘‘మిమ్మల్నే ప్రొడ్యూసర్ గారూ’’ అంటూ దగ్గరికి వచ్చి తనను కౌగిలించుకున్నట్లు నాని తెలిపాడు. చిరు తననిలా సంబోధించడం చాలా ఆశ్చర్యంగా అనిపించిందని నాని అన్నాడు. ‘కోర్ట్’ సినిమాకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో ప్రియదర్శితో కలిసి పాల్గొన్న సందర్భంగా నాని ఈ విషయం వెల్లడించాడు. ఇక ‘కోర్ట్’ సినిమాను నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడని తెలిసి, అది కచ్చితంగా హిట్ అవుతుందని చిరు తనతో అన్నట్లు ఈ సందర్భంగా ప్రియదర్శి వెల్లడించాడు.
This post was last modified on March 11, 2025 7:15 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…