పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్‌లో పెట్టిన మూడు చిత్రాల్లో ఏది ఎఫ్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని అయోమయం నెలకొంది. ముందుగా ఆయన లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘హరి హర వీరమల్లు’ను టేకప్ చేసినా.. దాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు. మార్చి 28కి రిలీజ్ డేట్ ఇచ్చేసి ప్రమోషన్లు కూడా మొదలుపెట్టిన చిత్ర బృందం.. చివరి షెడ్యూల్ కోసం పవన్ అందుబాటులోకి రాకపోవడంతో విడుదలను వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఈ నెల 28న ‘వీరమల్లు’ రాదన్నది పక్కా.
ఈ డేట్ మిస్ అయితే తర్వాత ఇంకెప్పుడు సినిమా రిలీజ్ చేస్తారన్నది ప్రశ్నార్థకం. ఎలాగైనా వేసవిలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు నిర్మాత ఏఎం రత్నం. ఇందుకోసం ఆయన కొత్త డేట్ మీద కన్నేసినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవికి లక్కీ డేట్ అనదగ్గ మే 9న ‘హరిహర వీరమల్లు’ను రిలీజ్ చేయాలని రత్నం భావిస్తున్నారట. ఈ తేదీకి చిరు సినిమా ‘విశ్వంభర’ను రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ.. అది సాధ్యపడేలా లేదు. ప్రస్తుతానికి ఆ క్రేజీ డేట్ ఖాళీగానే ఉంది. ఎవరూ కర్చీఫ్ వేయలేదు.
వచ్చే నెల రోజుల్లో పవన్ కనుక డేట్లు ఇచ్చి రాజస్థాన్‌లో తెరకెక్కించాల్సిన కీలక ఎపిసోడ్‌ను పూర్తి చేస్తే షూటింగ్ ఒక కొలిక్కి వచ్చేసినట్లే. మే 9కి సినిమాను రెడీ చేయడం కూడా కష్టం కాబోదు. ఇదే విషయం పవన్‌తో మాట్లాడి కాల్ షీట్లు కన్ఫమ్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్లకు రిలీజ్ గురించి సమాచారం ఇవ్వాలని రత్నం భావిస్తున్నారు. వేసవిలో పెద్ద సినిమాలేవీ లేని నేపథ్యంలో తమ చిత్రాన్ని మిడ్ సమ్మర్లో రిలీజ్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందని రత్నం భావిస్తున్నారు. పవన్ మరో చిత్రం ‘ఓజీ’ కోణంలో చూసినా.. వీరమల్లు వేసవిలో రావడం మంచిదే. కాబట్టి పవన్ కొంచెం మనసు పెడితే మే 9న ‘హరిహర వీరమల్లు’ ప్రేక్షకుల ముందుకు రావచ్చు.
This post was last modified on March 10, 2025 8:03 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…