బిగ్‍బాస్ షోలోకి వెళ్లే వారికి చాలా కఠినమైన ఆంక్షలుంటాయి. ప్రేక్షకులు ఎలిమినేట్ చేసేంతవరకు లోపల వుండాల్సిందే కానీ బయటకు రాకూడదు. అలా వెళ్లిపోతామని ఎవరైనా అడిగితే నష్ట పరిహారం తీవ్రంగా వుంటుంది. అదే విధంగా బిగ్‍బాస్ హోస్ట్కి కూడా చాలా భారీ మొత్తంలో గిట్టుబాటు అవుతుంది. అదే సమయంలో చాలా ఖచ్చితమైన నియమ నిబంధనలుంటాయి.
సెకండ్ సీజన్‍లో నానికి ఊపిరి సలపనివ్వలేదు. కేవలం పది వారాలకు కాంట్రాక్ట్ మాట్లాడుకుని, అవసరమయితే నిడివి పెంచుకుంటామనే నిబంధన వాడుకుని మరో అయిదు వారాలు పొడిగించారు. షూటింగ్ కోసం నానికి అసలు బ్రేక్ అనేది ఇవ్వలేదు. ఆడియన్స్ పల్స్ తెలీక బిగ్‍బాస్ రైటర్లు రాసిచ్చింది మాట్లాడేసి ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు. షో వదిలేయాలని ఎంత అనిపించినా కానీ పంటి బిగువున సీజన్ కంప్లీట్ చేసి ఇక మళ్లీ జీవితంలో బిగ్‍బాస్ హోస్ట్ చేయనని చెప్పేసాడు. ఇంత ఖచ్చితంగా వుండే బిగ్‍బాస్‍లో నాగార్జునకు మాత్రం ఆడింది ఆట అవుతోంది.
స్టార్ మాలో భాగస్వామి కావడంతో నాగార్జునకి ఎలాంటి టర్మ్స్ విధించలేకపోతున్నారు. గత సీజన్లో ఒక వారం స్కిప్ కొట్టిన నాగార్జున ఈసారి ఏకంగా మూడు వారాలకు ఎగనామం పెట్టేసారు. బిగ్‍బాస్ షోలో సీజన్ మధ్యకొచ్చేసరికి పోటీ తీవ్రతరమవుతుంది. ఇలాంటి టైమ్‍లో హోస్ట్ గైడెన్స్ చాలా కీలకం.
ఆల్రెడీ ఒక హోస్ట్ తో కనక్షన్ ఏర్పడి వాళ్లు ఇచ్చే సలహాలను ఫాలో అయ్యే ప్లేయర్లు గెస్ట్ హోస్ట్ తో ఇబ్బందులు పడతారు. పారితోషికం పరంగా అనూహ్యమయిన మొత్తం చెల్లిస్తున్నా కానీ నాగార్జున మాత్రం బిగ్‍బాస్‍కి పూర్తిస్థాయిలో టైమ్ కేటాయించడం లేదు. ఈ సీజన్ అనుభవంతో ఈసారి గ్యారెంటీ హోస్ట్ కోసం స్టార్ మా నెట్‍వర్క్ అన్వేషిస్తుందేమో.
This post was last modified on October 27, 2020 1:54 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…