హిందీ వెర్షన్ రిలీజైన మూడు వారాలకు డబ్బింగ్ విడుదల, అందులోనూ పైరసీ బారిన పడిన ముప్పు దీనికీ తప్పకపోవడం లాంటి కారణాలు ఛావా తెలుగు మీద ప్రభావం చూపిస్తాయేమోననే అనుమానాలు బద్దలయ్యాయి. ట్రేడ్ నుంచి అందుతున్న రిపోర్ట్ ప్రకారం మొదటి రోజే 2 కోట్ల 90 లక్షల దాకా వసూలైనట్టు సమాచారం. ఇది ఒక బాలీవుడ్ డబ్బింగ్ కు పెద్ద నెంబరే. ఎందుకంటే గతంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి అగ్ర హీరోల అనువాదాలే పెద్ద ఫిగర్లు నమోదు చేయలేకపోయాయి. అలాంటిది ఇమేజ్ లేని విక్కీ కౌశల్ ఇంత సాధించాడంటే అది ఖచ్చితంగా శంభాజీ మహారాజ్ పుణ్యమే.
ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. ముందు అనుకున్నట్టు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ ప్రభావం ఛావా మీద పడింది. యూత్, ఫ్యామిలీస్, మహేష్ వెంకీ అభిమానులు ఆ సినిమా ఆడుతున్న థియేటర్లకు పోటెత్తడం ఛావా వసూళ్లను తగ్గించింది. లేదంటే ఇంకో యాభై లక్షల నుంచి కోటి దాకా అదనంగా వచ్చేదని పంపిణి చేస్తున్న గీతా ఆర్ట్స్ వర్గాల నుంచి వినిపిస్తున్న గుసగుస. నిన్న సాయంత్రం నుంచి ఛావా పికప్ బాగుందని, ప్రధాన కేంద్రాల సెకండ్ షోలు దాదాపు ఫుల్స్ పడ్డాయని అంటున్నారు. బిసి సెంటర్స్ లో కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ వారాంతానికి సెట్ అయిపోవచ్చు.
ఇదే ఊపు కనక కొనసాగితే ఛావా సూపర్ హిట్ ఖాతాలో చేరిపోతుంది. ఎంత మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనే లెక్కలు ఇంకా బయటికి రాలేదు. హైదరాబాద్ లాంటి చోట్ల హిందీ వెర్షన్ ఇంకా కొనసాగిస్తున్న నేపథ్యంలో తెలుగుకు స్క్రీన్లు పెంచాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. నిన్న రిలీజైన కొత్త సినిమాల్లో దేనికీ పాజిటివ్ టాక్ రాకపోవడం ఛావాకు కలిసి వచ్చే అంశమే. ఎలాగూ ఇంకో వారం మార్చి 14 దాకా బాక్సాఫీస్ దగ్గర గ్యాప్ ఉంది. ఎలా చూసుకున్నా ఛావా భారీ అంకెలతోనే గట్టెక్కేలా ఉంది. పాజిటివ్ టాక్, రష్మిక మందన్న, ఏఆర్ రెహమాన్ సంగీతం లాంటి అంశాలు పాజిటివ్ గా పని చేస్తున్నాయి.
This post was last modified on March 8, 2025 10:42 am
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…
ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…
వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…