పవన్‍కళ్యాణ్ కొత్త సినిమా అనౌన్స్ చేసాడనే ఆనందం కంటే… అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‍లో నటిస్తున్నాడని, అది కూడా సాగర్ చంద్ర లాంటి పేరు తెలియని దర్శకుడితో చేస్తున్నాడని అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. నిజానికి వకీల్ సాబ్‍లో పవన్ నటించడమే చాలా మంది అభిమానులకు ఇష్టం లేదు.
పవన్ స్క్రీన్ ఇమేజ్‍కి, అతని యాక్టింగ్ స్టయిల్‍కి ఆ కథ, పాత్ర సూట్ కావని ఫాన్స్ కి బాగా తెలుసు. కానీ పవన్‍తో అంత ట్రావెల్ చేసిన త్రివిక్రమ్‍కి తెలియలేదు. ఎందుకంటే పింక్ రీమేక్ చేయమంటూ పవన్‍ని ప్రోత్సహించింది త్రివిక్రమ్ అట. అసలయితే దిల్ రాజుతో కలిసి నిర్మాణంలో భాగస్వామ్యం కూడా తీసుకోవాలని అనుకున్నాడు కానీ అది కుదరలేదు.
వకీల్ సాబ్ విషయంలోనే త్రివిక్రమ్ పట్ల ఫాన్స్ కోపంగా వుంటే తాజాగా అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ చేయడానికి పవన్ ఉపక్రమించడానికి కూడా కారణం త్రివిక్రమ్ అని ఫాన్స్ బలంగా నమ్ముతున్నారు. త్రివిక్రమ్‍తో చాలా మంచి అనుబంధం వున్న సితార ఎంటర్‍టైన్‍మెంట్స్లో ఈ సినిమా అనౌన్స్ అవడంతో త్రివిక్రమ్ పాత్రపై చాలా రూమర్లు వినిపిస్తున్నాయి.
అజ్ఞాతవాసి లాంటి ఫ్లాప్ ఇవ్వడమే కాకుండా పవన్‍తో ఇలాంటి రాంగ్ ప్రాజెక్టులు చేయిస్తున్నాడని, పవన్ క్రేజ్‍ని, అతడితో వున్న స్నేహాన్ని త్రివిక్రమ్ ఇలా వాడుకుంటున్నాడని ఫాన్స్ నుంచి విమర్శలొస్తున్నాయి. పవన్‍తో ఇంతవరకు త్రివిక్రమ్ మరో సినిమా అనౌన్స్ చేయకపోవడం వారిని మరింతగా హర్ట్ చేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates