టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకరిగా ఉన్నారు అక్కినేని నాగార్జున. కానీ తర్వాతి తరం హీరోల హోరులో ఆయన జోరు తగ్గింది. గత ఏడెనిమిదేళ్లలో అయితే నాగ్ బాగా ఇబ్బంది పడుతున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత ఆయనకు అలాంటి పెద్ద సక్సెస్ లేకపోయింది. నెమ్మదిగా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ కరిగిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా డిజాస్టర్ అయింది. బంగార్రాజు, నా సామిరంగ చిత్రాలు సంక్రాంతి టైంలో రిలీజై ఏదో ఒక మోస్తరుగా ఆడేశాయి.
నాగ్ చిత్రాల బడ్జెట్లు, బిజినెస్ లెక్కలు చూస్తే మిడ్ రేంజ్ యంగ్ హీరోల కంటే ఆయన చాలా వెనుకబడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన సోలో హీరోగా సినిమానే చేయకుండా బ్రేక్ తీసుకున్నారు. ‘నా సామిరంగా’ విడుదలై ఏడాది దాటినా నాగ్ ఇంకా సినిమా మొదలుపెట్టలేదు. సోలో హీరోగా సినిమాలు ఆపేసిన నాగ్.. కుబేర, కూలీ లాంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించారు. ఈ రెండు చిత్రాలకూ మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘కూలీ’కి తెలుగులోనూ హైప్ మామూలుగా లేదు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ చిత్రానికి తెలుగు రైట్స్ ఏకంగా రూ.40 కోట్లు పలుకుతున్నాయట. ‘2.0’ను పక్కన పెడితే.. రజినీ సినిమాలకు గత దశాబ్ద కాలంలో తెలుగులో మార్కెట్ బాగా దెబ్బ తింది. రజినీ చివరి సినిమా ‘వేట్టయాన్’ కనీసం పది కోట్ల బిజినెస్ చేయలేకపోయింది. అలాంటిది ‘కూలీ’కి రూ.40 కోట్లు పలకడమంటే మాటలు కాదు. ఇక్కడ లోకేష్ కనకరాజ్ ఫ్యాక్టర్ కూడా కీలకమే అయినప్పటికీ.. నాగ్ స్పెషల్ రోల్ చేయడం దీనికి బాగా అడ్వాంటేజ్ అవుతోందనడంలో సందేహం లేదు. నాగ్ గత కొన్నేళ్లలో చేసిన సోలో సినిమాలను మించి.. ఈ చిత్రంలో ఆయన పాత్రను చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ఉపేంద్ర సైతం ఓ ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వేసవి చివర్లో ‘కూలీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
This post was last modified on March 7, 2025 4:30 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…