ఈ నెలలో రిలీజవుతున్న క్రేజీ చిత్రాల్లో ‘దిల్ రుబా’ ఒకటి. ‘క’ లాంటి సూపర్ హిట్ తర్వాత కిరణ్ నటించిన చిత్రం కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. మార్చి 14న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఈ రోజే ట్రైలర్ లాంచ్ చేసింది చిత్ర బృందం. దానికి మంచి స్పందనే వస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ని పోలిన క్యారెక్టరైజేషన్‌తో కిరణ్ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ కూడా మెప్పించింది. ఐతే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రుక్సర్ స్టేజ్ మీద మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఈవెంట్లో కొందరు తనను అభ్యంతరకర రీతిలో ఫొటోలు తీయడం ఆమెకు నచ్చలేదు. ఈ విషయం మీద కొంచెం అసహనంతోనే మాట్లాడింది రుక్సర్.
తాను అన్ కంఫర్టబుల్‌గా ఉన్నానని చెప్పినా వినకుండా కొందరు ఫొటోలు తీసినట్లు రుక్సర్ వెల్లడించింది. స్టేజ్ మీద టీంతో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చినా సరే.. కొందరు మాత్రం అభ్యంతరకర యాంగిల్స్‌లో ఫొటోలు తీశారని రుక్సర్ తెలిపింది. ఇది గమనించి తాను వారించానని.. చాలా మంచిగానే వాళ్లకు ఫొటోలు తీయొద్దని చెప్పానని.. అయినా ఆగకుండా ఫొటోలు తీశానని రుక్సర్ తెలిపింది. ‘దిల్ రుబా’లో ప్రేమ గురించి ఎంతో బాగా చెప్పిన సినిమా అని.. తాను కూడా అందరితో ప్రేమగానే మాట్లాడతానని.. అయినా సరే వద్దని వారించినా వినకుండా ఫొటోలు తీయడం ఏంటని రుక్సర్ ఆవేదన వ్యక్తం చేసింది.
తాను ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నానో వాళ్లకు అర్థం అవుతాయని అంటూ.. స్పీచ్ చివర్లో కింది వైపు చాలా కోపంగా చూసి వెళ్లిపోయింది రుక్సర్. ఆమె చూపును బట్టే ఆమె పర్టికులర్‌గా కొందరిని ఉద్దేశించే ఈ మాటలు అందని అర్థమైంది. ఒక హీరోయిన్ తాను అన్ కంఫర్టబుల్ అని చెప్పినా.. అలాంటి యాంగిల్స్‌లో ఫొటోలు తీయడం ముమ్మాటికీ తప్పే. ఈ మధ్య కీర్తి సురేష్ సైతం ఒక ఫొటోగ్రాఫర్‌పై ఇలాగే ఫ్రస్టేట్ అయింది.
This post was last modified on March 7, 2025 11:10 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…