తమిళ స్టార్ హీరోల్లో ధనుష్ మల్టీ టాలెంటెడ్ అనే విషయం తెలిసిందే. అతను పాటలు రాస్తాడు. పాడతాడు. కథలు రాస్తాడు. డైరెక్ట్ చేస్తాడు. తన దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘పవర్ పాండి’ పెద్ద హిట్. రెండో సినిమా ‘రాయన్’ తమిళంలో ఇంకా పెద్ద హిట్ అయింది. మూడో చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. ప్రస్తుతం తనే లీడ్ రోల్ చేస్తూ ‘ఇడ్లి కడై’ అనే సినిమా తీస్తున్నాడు ధనుష్. ఆ చిత్రం వేసవిలో విడుదల కాబోతోంది. దీని తర్వాత ధనుష్ డైరెక్ట్ చేయబోయే కొత్త సినిమా గురించి క్రేజీ న్యూస్ కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అతను తొలిసారి ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడట. ఆ హీరో ఇంకెవరో కాదు.. అజిత్ కుమార్.
ప్రస్తుతం తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో అజిత్ ఒకడు. ఆయనతో ధనుష్ సినిమా చేయబోతున్నాడనే వార్త సెన్సేషన్‌గా మారింది. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అక్కడ నంబర్ వన్ స్థానానికి విజయ్‌తో గట్టి పోటీగా నిలుస్తూ వచ్చిన హీరో అజితే. గత కొన్నేళ్లలో విజయ్‌కి కొంచెం ఎడ్జ్ ఉన్నప్పటికీ.. అతను రాజకీయాల్లోకి వెళ్లిపోతుండడంతో నంబర్ వన్ స్థానం ఖాళీ కాబోతోంది. అది అజిత్ తీసుకుంటాడని భావిస్తున్నారు. వేసవిలో విడుదల కాబోతున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అంచనాల మేర ఆడితే అజిత్‌కు తిరుగుండదు.
దాని తర్వాత అజిత్ చేయబోయే కొత్త చిత్రం గురించి ఇప్పటిదాకా ఏ సమాచారం లేదు. కానీ ఇప్పుడు ధనుష్ దర్శకత్వంలో అజిత్ నటించబోతున్నట్లు వార్త బయటికి వచ్చింది. ధనుష్ సినిమాల్లో ఎమోషన్లతో పాటు ఎలివేషన్లు కూడా గట్టిగానే ఉంటాయి. ‘రాయన్’ సినిమా చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అతను అజిత్‌కు తగ్గ మంచి మాస్ సినిమా తీశాడంటే బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం. ఈ చిత్రంలో ధనుష్ కూడా నటిస్తే క్రేజ్ వేరే లెవెల్‌కు వెళ్తుంది. మరి నిజంగానే ఈ క్రేజీ కాంబో కార్యరూపం దాల్చుతుందేమో చూడాలి.
This post was last modified on March 6, 2025 5:59 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…