మానవాళిని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ ఇప్పటిది కాదు. వైద్య రంగం ఎంతో పురోగతి సాధించినా ఇప్పటికీ ఆ జబ్బుకు శాశ్వత పరిష్కారం కనుక్కోలేకపోయారు. కాకపోతే పోరాడి సాధించి తిరిగి జీవితాన్ని నిర్మించుకున్న సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. క్రికెటర్ యువరాజ్ సింగ్, సీనియర్ హీరోయిన్లు మనిషా కొయిరాలా – లీసారే – సోనాలి బెంద్రే ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే ఉంది. అయితే అవగాహనా లోపం, చికిత్స సరైన సమయంలో దక్కపోవడం లాంటి కారణాల వల్ల చనిపోయిన మాములు జనం లక్షల్లో ఉంటారు. ఇలాంటి వాళ్లకు ధైర్యం ఇవ్వడం కోసం శివరాజ్ కుమార్ నడుం బిగించారు.
నూటా యాభై సినిమాలు పూర్తి చేసేందుకు పరుగులు పెడుతున్న శాండల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గత ఏడాది క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. చికిత్స కోసం మూడు నెలల క్రితం అమెరికా వెళ్లి దిగ్విజయంగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. కీమోథెరపీ చేయించుకున్నప్పుడు కూడా జుట్టు రాలలేదని, తన మనోనిబ్బరం, ప్రజల ఆశీర్వాదాలతో కొత్త జన్మ అందుకున్నానని ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. క్యాన్సర్ మీద ఆయన చేసిన యుద్ధాన్ని డాక్యుమెంటరీగా రూపొందించి త్వరలోనే విడుదల చేస్తారట. ఎందరో సామాన్యులకు స్ఫూర్తినివ్వడం కోసం దీన్ని అందుబాటులోకి తేబోతున్నారు.
ఇది మంచి నిర్ణయమే. ఆరు పదుల వయసులో చిన్న అనారోగ్యం వస్తేనే తట్టుకోవడం కష్టం. అలాంటిది క్యాన్సర్ తో పోరాడి బయటికి రావడం చిన్న విషయం కాదు. అంతే కాదు వచ్చిన వెంటనే ఎక్కువ రెస్టు తీసుకోకుండా వెంటనే షూటింగుల్లో చేరిపోతున్నారు శివరాజ్ కుమార్. రామ్ చరణ్ 16లో ఆయనో కీలక పాత్ర చేస్తున్న విషయం విదితమే. ఇటీవలే లుక్ టెస్ట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేశాడని యూనిట్ టాక్. జైలర్ లో నరసింహగా మనకూ దగ్గరైన శివరాజ్ కుమార్ రామ్ చరణ్ తో కలిసి తొలిసారి తెలుగు డైలాగులు చెబుతూ పెర్ఫార్మ్ చేయడం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on March 6, 2025 5:15 pm
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…