‘యానిమల్’తో తమ్ముడు – ‘ఫౌజీ’తో అన్నయ్య ?

బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోలకు బ్రేక్ ఇచ్చే బాధ్యతను తెలుగు దర్శకులు తీసుకున్నారు కాబోలు. యానిమల్ తో బాబీ డియోల్ కు సందీప్ రెడ్డి వంగా ఎంత పెద్ద సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చాడో మాటల్లో చెప్పడం కష్టం. మొన్నటిదాకా అవకాశాలు లేక అలో లక్ష్మణా అంటున్న అతనికి ఒక్కసారిగా ఆఫర్లు చుట్టుముట్టి మోస్ట్ డిమాండింగ్ ఆర్టిస్ట్ అయిపోయాడు. ఏకంగా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి బడా స్టార్లతో విలన్ గా నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇతని అన్నయ్య సన్నీ డియోల్ పరిస్థితి కూడా గదర్ 2 కు ముందు అలాగే ఉండేది. అది ఇచ్చిన సక్సెస్ కిక్ నిర్మాతలను వెంట పడేలా చేసింది.

గదర్ 2 మనోళ్లకు సంబంధం లేనిదే అయినా సన్నీ డియోల్ కు సంబంధించిన మరో విశేషం ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ప్రభాస్ ఫౌజీలో ఆయనో ముఖ్యమైన పాత్ర చేస్తున్నారట. విలన్ అనే ప్రచారం ఉంది కానీ ఒకవైపు హీరోగా క్రేజీ సినిమాలు చేస్తున్న టైంలో ప్రతినాయకుడిగా ఈ సీనియర్ హీరో ఒప్పుకుంటాడా అనేది అనుమానమే. ఒకవేళ ఫౌజీలో చేస్తోంది నిజమే అయితే ఏదైనా పాజిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ కావొచ్చు. ఫౌజీ నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్సే సన్నీ డియోల్ జాత్ ప్రొడ్యూసర్లు కాబట్టి ఈ కాంబో సాధ్యమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అఫీషియల్ నోట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఫౌజీకి ఇంకా చాలా బ్యాలన్స్ ఉంది. ది రాజా సాబ్ కి తాత్కాలిక బ్రేక్ ఇచ్చి మరీ ప్రభాస్ దీని కోసం టైం కేటాయించాడు. లుక్ కూడా పూర్తిగా మార్చుకున్నాడు. ఈ కారణంగానే వేరే సినిమాకు డేట్స్ ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఫౌజీకి స్వాతంత్రం రాకముందు బ్యాక్ డ్రాప్ ని తీసుకుని దర్శకుడు హను రాఘవపూడి చాలా ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారని టాక్. ది రాజా సాబ్ 2025లో రిలీజవుతుంది కాబట్టి వచ్చే ఏడాది వేసవిని ఫౌజీ లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఇప్పటికైతే విడుదల తేదీలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.