దశాబ్దంన్నరకు పైగా హీరోయిన్ గా వెలుగుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి ఆ జంట దాచిపెట్టలేదు. మొదట్లో తమ బంధాన్ని గుట్టుగా ఉంచినా తర్వాత ఓపెనైపోయారు. కలిసి ఈవెంట్లకు వెళ్లడం, మీడియా కెమెరాలకు ఫోజులు ఇవ్వడం చాలానే జరిగాయి. ఇద్దరూ వేర్వేరు అవకాశాలతో కెరీర్ పరంగా చాలా బిజీ ఉన్నారు. ముఖ్యంగా విజయ్ వర్మ వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్న వైనం వరస హిట్లతో కనిపిస్తోంది. తాజాగా ముంబై మీడియా కథనాల ప్రకారం తమన్నా, విజయ్ లు విడిపోవాలని నిర్ణయించుకున్నారట. వాళ్ళుగా చెప్పలేదు కానీ కన్ఫర్మ్ అంటున్నారు.
2023 లస్ట్ స్టోరీస్ షూటింగ్ సందర్భంగా ఈ ఇద్దరి మనసులు కలిశాయి. తక్కువ టైంలో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ లవ్ స్టోరీ మొదలయ్యాకే విజయ్ వర్మ కెరీర్ ఊపందుకోవడం గమనార్హం. అంతా బాగుందనుకుంటున్న టైంలో కారణాలు బయటికి చెప్పడం లేదు కానీ లైఫ్ పార్ట్ నర్స్ గా కన్నా మంచి స్నేహితులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు వినికిడి. ప్రస్తుతానికి ఇది పుకారుగానే చూడాలి. ఒకవేళ ఇంకొంత కాలం తమన్నా, విజయ్ వర్మలు కనక వేడుకలు ఇతరత్రా చోట్ల కలిసి కనిపించకపోతే అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. గత కొన్ని నెలలుగా ఇది జరగకపోవడం అసలు ట్విస్టు.
స్నేహం, బంధం, ప్రేమ, గాసిప్స్ గురించి పలు సందర్భాల్లో విజయ్ వర్మ, తమన్నాలు పలు సంగతులు పంచుకున్నారు కానీ చూచాయగా తమ రిలేషన్ క్లైమాక్స్ కు వెళ్తోందనే సంకేతం మాత్రం ఇవ్వలేదు. సినిమాల సంగతికొస్తే మహిళా అఘోరాగా తమన్నా తొలిసారిగా నటించిన ఓదెల 2 ఇటీవలే కుంభమేళాలో టీజర్ లాంచ్ జరుపుకుంది. సంపత్ నంది రచన, నేతృత్వంలో నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ కొత్త బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉంది తమన్నా. జైలర్, స్త్రీ 2 స్పెషల్ సాంగ్స్ చాలా పేరు తీసుకొచ్చిన నేపథ్యంలో మరిన్ని ఆఫర్లు వస్తున్నాయట. కానీ లీడ్ రోల్ అయితే ఒప్పుకుంటోందని టాక్.
This post was last modified on March 4, 2025 5:12 pm
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…