యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన దృష్టి మొత్తం స్పిరిట్ మీద పెడుతున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకముందే పలు ఇంటర్వ్యూల్లో అతనిస్తున్న ఎలివేషన్లు ఎప్పుడెప్పుడు ప్రభాస్ ని పోలీస్ ఆఫీసర్ గా చూద్దామా అనిపించేలా ఉన్నాయి. అయితే దీని తర్వాత తను అల్లు అర్జున్ తో ఒక సినిమా, యానిమల్ పార్క్ చేయాల్సి ఉంది. ఇవి బన్నీ, రన్బీర్ కపూర్ డేట్ల అందుబాటుని బట్టి ఉంటాయి తప్పించి ఖచ్చితంగా ఫలానా టైం అని చెప్పలేని పరిస్థితి. అయితే సందీప్ వంగా ఇన్ డైరెక్ట్ గా ఇస్తున్న కొన్ని సంకేతాలు తన మనసులో మెగా ప్రాజెక్టుని బయట పెడుతున్నాయి.
కొద్దిరోజుల క్రితం ఆరాధనలో చిరంజీవి కోపంగా చూస్తున్నస్టిల్ ని ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా పెట్టి దాన్నో డిస్కషన్ టాపిక్ గా మార్చిన సందీప్ వంగా సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేశాడు. తాజాగా బుచ్చిబాబుతో కలిసి అదే ఫోటో ముందు ఫ్రెష్ గా ఫోజు ఇవ్వడం ఇంకో చర్చకు దారి తీసింది. చిరంజీవితో సందీప్ వంగా ఒక సినిమా చేయాలనేది ఫ్యాన్స్ కోరిక. మెగా వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు ఇది నిజమయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం. వశిష్ట, అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల, బాబీ తర్వాత మెగాస్టార్ తో చేయి కలిపేది సందీప్ వంగానే అని బలంగా వినిపిస్తోంది.
కాకపోతే బాగా టైం పట్టొచ్చు. ఎందుకంటే సందీప్ తన అభిమాన హీరోలతో చేయడానికి ఛాన్స్ వస్తే వదులుకోడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సాధ్యం కాదు కానీ చిరంజీవికి సరైన కథ రాసుకుంటే కాంబోని నిజం చేయొచ్చు. పదే పదే మెగాస్టార్ హైలైట్ అయ్యేలా సందీప్ వంగా ఇస్తున్న హింట్లు ఇదే సూచిస్తున్నాయని అనుకోవాలేమో. స్పిరిట్ వేసవిలో మొదలుపెట్టాలనేది ప్రస్తుతమున్న ప్రతిపాదన. ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీలు పూర్తి చేసుకుని వస్తే కానీ సందీప్ ముందడుగు వేయలేడు. దాని కోసమే ఎదురు చూస్తున్నాడు. క్యాస్టింగ్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగిపోతున్నాయి.
This post was last modified on March 4, 2025 3:13 pm
https://www.youtube.com/watch?v=hFNCZ_oVOZ4 ఏడాదిన్నరగా కళ్యాణ్ రామ్ కు గ్యాప్ వచ్చేసింది. డెవిల్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ నందమూరి హీరో…
ఒకపక్క కామెడీ వేషాలు ఇంకోవైపు విలన్ పాత్రలు వేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా నడిపిస్తున్న సునీల్ కు కోలీవుడ్ లో…
అంతా అనుకున్నట్టే అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండానే జనసేన ఓ మునిసిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా…
తమిళ జనాలకు మహేంద్రసింగ్ ధోని అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆ జట్టుకు…
తమిళంలో ఆ మధ్య పెరుసు అనే సినిమా రిలీజయ్యింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. తెలుగు డబ్బింగ్ తో పాటు…
గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్…